Why BJP did not give ticket to Varun Gandhi………………….
మూడు దశాబ్దాలకుపైగా గాంధీ కుటుంబీకులు ప్రాతినిధ్యం వహించిన ఫిలిభిత్ నియోజకవర్గం ఈ సారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. యూపీ లోని ఈ నియోజకవర్గానికి 30 ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు.
ఈ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. వరుణ్ తల్లికి మాత్రం టిక్కెట్ ఇచ్చారు. బీజేపీ పై విమర్శలు చేసిన కారణం గానే సిటింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టిక్కెట్ నిరాకరించారని పరిశీలకులు అంటున్నారు.
తొలి విడతలోనే అంటే ఏప్రిల్ 19 న పిలిభిత్లో పోలింగ్ జరగనుంది. ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాదను బీజేపీ బరిలోకి దింపింది. 2021లో జితిన్ ప్రసాద బీజేపీ లో చేరారు. తర్వాత రాష్ట్ర మంత్రి అయ్యారు. జితిన్ ప్రసాద పిలిభిత్కు పూర్తిగా కొత్త,.. స్థానికేతరుడు.
షాజహాన్‌పుర్‌కి చెందిన వాడు .. కాంగ్రెస్ లో ఉన్నపుడు జితిన్ ప్రసాద 2004, 2009 ఎన్నికల్లో షాజహాన్‌పుర్, ధరువాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు… ఇక్కడ సమాజ్వాదీ .. కాంగ్రెస్ కూటమి భగవత్ శరణ్ గంగ్వార్ ని బరిలోకి దింపింది. బీఎస్పీ అనీష్ అహ్మద్ ఖాన్ ను పోటీకి దింపింది
ఈ పిలిభిత్ నియోజకవర్గం నేపాల్ సరిహద్దులోని తేరాయ్ బెల్ట్‌లో ఉంది. ఇక్కడ 18 లక్షల మంది ఓటర్లున్నారు. పిలిభిత్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. బహెరి, పిలిభిత్, బార్ఖెరా, పురాన్‌పుర్, బిలాస్‌పుర్ దీని పరిధిలోకి వస్తాయి. ఇందులో నాలుగు సీట్లను బీజేపీ , ఒకటి సమాజ్‌వాదీ గెలుచుకున్నాయి.
పిలిభిత్లో తొలిసారిగా జనతాదళ్ నుంచి మేనకా గాంధీ ఎన్నికయ్యారు. 1991లో మాత్రం ఓడిపోయారు. 1996 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి గాంధీ కుటుంబీకులే వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998, 1999లో స్వతంత్ర అభ్యర్థిగా మేనకా గాంధీ పోటీ చేసి గెలిచారు. 2004, 2014లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు.
2009, 2019లో పీలీభీత్ నుంచి వరుణ్ గాంధీ ఎన్నికయ్యారు. 2019లో తాను గెలిచిన సుల్తాన్‌పుర్‌లో మరోసారి మేనకా గాంధీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుణ్ గాంధీతో తమకున్న సంబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ‘జితిన్ ప్రసాద ప్రభావం ఇక్కడ పెద్దగా లేదు. ఆయనను స్థానికేతరుడిగా చూస్తున్నారు’ అని స్థానికులు అంటున్నారు.
వరుణ్ గాంధీ తనకు పిలిభిత్ తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని .. పదవిలో ఉన్నా .. లేకున్నా ఒక బిడ్డగా సేవలు చేస్తానని అంటున్నారు. ప్రజలతో తన బంధం కొనసాగుతుందని చెబుతూ వరుణ్ ఒక లేఖ కూడా రాశారు.
పార్టీ మద్దతు తనకే ఉందని జితిన్ ప్రసాద చెబుతున్నా … అధిష్ఠానం నిర్ణయం పై స్థానిక నాయకత్వం అసంతృప్తిగానే ఉంది.టికెట్ నిరాకరించిన తర్వాత పిలిభిత్కు వరుణ్ గాంధీ రాలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు.