IRCTC GOLDEN TRIANGLE Tour Package …………
‘గోల్డెన్ ట్రయాంగిల్’ టూర్ పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ టూర్ ప్యాకేజి లో భాగంగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ పట్టణాలలో ఉన్న దర్శనీయ ప్రదేశాలను చూసి రావొచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 15, 2025వ తేదీన అందుబాటులో ఉంది. 7 రాత్రులు, 8 రోజుల పాటు ఈ ప్యాకేజీ టూర్ సాగుతుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ఉంటుంది. 15 వ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
IRCTC వెబ్ సైట్ లోకి వెళ్లి ‘GOLDEN TRIANGLE’ ప్యాకేజీపై క్లిక్ చేసి ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. టూర్ కింది విధంగా సాగుతుంది
Day 1.... ఉదయం 6 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి (Train No. 12723) రైలు బయలు దేరుతుంది. పగలు .. రాత్రంతా ప్రయాణం లో గడపాలి.
Day 2…. ఉదయం 07.40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. హెూటల్ లో చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత… కుతుబ్ మినార్ కు వెళతారు. లోటస్ టెంపుల్, అక్షరధామ్ సందర్శిస్తారు. ఆ రాత్రి ఢిల్లీలో బస చేస్తారు.
Day 3... రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్, తీన్ మూర్తి భవన్, ఇండియా గేట్ సందర్శిస్తారు. రాత్రి ఢిల్లీలో బస చేస్తారు.
Day 4... జైపూర్ కి బయలుదేరతారు. అక్కడ హెూటల్ లో చెకిన్ అవుతారు. తర్వాత హవా మహల్ సందర్శిస్తారు. ఆ రాత్రి జైపూర్ లోనే బస చేస్తారు.
Day 5... అమీర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ ను సందర్శిస్తారు.
Day 6.. హోటల్ నుంచి చెక్ అవుట్ అయి ఆగ్రాకు బయలు దేరుతారు. మార్గ మధ్యంలో ఫతేపూర్ సిక్రీకి వెళ్తారు.ఆ రాత్రి ఆగ్రాలోనే బస చేస్తారు.
Day 7.. ఉదయం తాజ్ మహల్ ను సందర్శిస్తారు. ఆగ్రా ఫోర్ట్ కు వెళతారు.సాయంత్రం 5 గంటలకు ఆగ్రా రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. రాత్రంతా జర్నీచేస్తారు.
Day 8 ... సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది.
గోల్డెన్ టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి..
కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ షేరింగ్ కు రూ. 58340 చెల్లించాలి … డబుల్ షేరింగ్ రూ.32640, ట్రిపుల్ షేరింగ్ రూ. 25420 గా నిర్ణయించారు.
స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కి రూ.55290, డబుల్ షేరింగ్ కి రూ. 29590, ట్రిపుల్ షేరింగ్ కి రూ.22370 చెల్లించాలి.
కంఫర్ట్ క్లాస్ లో 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు With Bed 18440/- Without bed 17320/ చెల్లించాలి. అదే స్టాండర్డ్ క్లాస్ లో 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు With Bed 15390/- Without bed 14260/- చెల్లించాలి.
5 సార్లు బ్రేక్ ఫాస్ట్ హోటల్ లో ఏర్పాటు చేస్తారు.. లంచ్ , డిన్నర్ ఖర్చు యాత్రికులే సొంతంగా భరించాలి. రూమ్స్ ప్యాకేజీలో భాగంగా బుక్ చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది.
కింది లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజి బుక్ చేసుకోవచ్చు
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR044
Mob: 8287932229 / 8287932228 / 9701360701 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు.