మామూలుగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంటే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలు ఏమిటి ? అంటుంటారు. కానీ మరోపక్క ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే కుక్కలకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నయా ? లేవా అని పరిశోధనలు జరిగాయి.మనలో చాలామంది కుక్కలకు ఏదో శక్తులు ఉన్నాయని నమ్ముతారు. కుక్క ఏడుస్తుంటే ఏదో జరిగిపోతుందని భావిస్తారు. అరిష్టమని అంటూవుంటారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరూ తేల్చి చెప్పలేదు. కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ ఫలితాలు ఏమీ తేల్చలేకపోయాయి. గ్రీకులు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు.
అవి దెయ్యాలను చూడగలవని , దుష్టశక్తులను పసిగట్టగలవని గ్రీకులు నమ్ముతారు. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందని … ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారని కూడా అనుకుంటారు. ఆధునికుల్లో కూడా కొందరు ఈ వాదనను సమర్ధించేవారున్నారు. మాత్ గ్రోనింగ్ అనే అమెరికా రచయిత కుక్కలకు దెయ్యాలు కనబడతాయని ఒక పుస్తకంలో రాసాడట. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూసే అయివుంటుందని, అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనక్కూడా కనిపిస్తుందని రాశాడాయన. దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతోమంది నమ్మారు. దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు. దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భం గానే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా? అనే చర్చ కూడా జరిగింది. అయితే అది నిజం ఎంత మాత్రం కాదనే అభిప్రాయం వ్యక్తంచేశారు కొందరు శాస్త్రవేత్తలు. దెయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వారు.
కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు పసిగడతాయని అంటున్నారు. రచయిత పెగ్గీ స్మిత్ తో పాటు మరికొందరు కూడా కుక్కల గురించి పరిశోధనలు చేసి పలు పుస్తకాలు రాశారు.మొత్తం మీద కొన్ని జంతువులకు (ముఖ్యంగా కుక్కలకు) అతీంద్రియ శక్తులు వున్నాయని భావించడం సరి కాదు అనే భావన వ్యక్తమౌతోంది. అలాగే మనుషులలో కూడా కొంతమందికి ఇలాంటి శక్తులు ఉన్నాయనుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసే వారు ఉన్నారు.
కుక్కలకు తమ పరిసరాలతొ,యజమానులతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది.యజమాని చనిపోయే ముందు రోజు చనిపోయిన కుక్కలను,యజమాని చనిపోయిన నాటినుంచి ఆహారం తీసుకోకుండా వారం లోపల కుక్కలు చనిపోయినట్టు ఎన్నో వార్తలు మనం విన్నాం . అయితే అతీంద్రియ శక్తులకు … ఈ ఘటనలకు సంబంధం లేదని పరిశోధకులు అంటున్నారు.. ఇక ఇది అనంతమైన సబ్జక్ట్ … ఎందరో కుక్కలపై పరిశోధనలు చేసి పలు విషయాలు రాశారు. అంతర్జాలంలో చూస్తే వీటికి సంబంధించి మరోలోకం కనిపిస్తుంది. శునక జాతి కున్న శక్తి యుక్తులు గురించి ఎంతోమంది ఎన్నో వ్యాసాలు రాశారు .
ఇది కూడా చదవండి >>>>>>అతీంద్రియ శక్తులు కావాలా ?