విగ్రహాలకి ఖర్చు అవసరమా ? అన్నది మాములుగా అందరిలో ఉదయించే ప్రశ్న.కానీ విగ్రహం అన్నది ఆ చుట్టూ పరిసర ప్రాంతాల పైన,మనుషుల పైన ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది.ఊరూరా ఉన్న చాలామంది గొప్పవాళ్ళ విగ్రహాలు ఆయా భావజాలాలను ప్రజల్లో చిరస్థాయిగా నిలిపేందుకు దోహదం చేస్తాయి.
గాంధీ గారి విగ్రహం ముందు ఎవరైనా మందు తాగితే,నవ్వులాటగా వాడు చూడరా.. గాంధీ గారి విగ్రహం దగ్గర మందు తాగుతున్నాడ్రా అని వెటకారం చెయ్యడం చూస్తే విగ్రహం అన్నది ఎంత ప్రభావం చూపిస్తుందో అర్ధం అవుతుంది.అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందుతారు.
Statue Of Liberty నుండి ఈ మధ్య వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ Statue Of Unity దాకా ప్రపంచం మొత్తం కూడా “విగ్రహాలు అన్నవి ప్రజల్లో చైతన్య దీపికలు” అవుతున్నాయి అన్నది మనకు తెలిసిన విషయమే.ఇక విషయానికి వస్తే శ్రీ మత్ రామనుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల సందర్బంగా ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్యులు వారి 216అడుగులు భారీ విగ్రహం ఆవిష్కరణ జరగబోతున్నది.
ఈ సందర్బంగా రామానుజా చార్యులు వారి జీవితం,భావజాలం వంటి విషయాల మీద ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది.ఈ నేపథ్యంలో కొండపాక team మరియు BPS audio &video వారు రామానుజాచార్యుల వారి జీవితం గురించి తెలియచేస్తూ ఒక వీడియో song విడుదల చేశారు. .దాన్ని ఈ మధ్యే చిలుకూరు బాలాజీ స్వామి వారి పాదాల చెంత ఉంచి స్వామి ఆశీస్సులు, ప్రధాన అర్చకుల ఆశీర్వచనాలు తీసుకొని తెలంగాణా ఆర్థిక, ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు చేతులు మీదుగా విడుదల చేసారు.
చిత్(మనిషి) అచిత్(ప్రకృతి)ప్రకారి(ఈశ్వరుడు)అను మూడు భావాలు గురించి బోధించే విశిష్ట అద్వైతమును ప్రచారం చేసిన వారుశ్రీమద్ రామానుజాచార్యుల వారు.భారతదేశం లో 11వ శతాబ్దం లోనే సమతా భావన గురించి ఉద్యమాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి ఆయన.
ఛాందసం గా మారిన ఆచారాలని వదిలివెయ్యాలని,గురువులు చెప్పినంత మాత్రాన దేన్నీ గుడ్డిగా నమ్మకూడదని ఆ కాలంలోనే బోధించిన గొప్ప హేతువాది.భగవంతుణ్ణి పూజించటం ప్రతీ మనిషికి గల హక్కు,ప్రతీ ఒక్కరికి దేవాలయంలో ప్రవేశించే హక్కు ఉంది అని చాటిన సమతా మూర్తి..
కేవలం బోధనలనే కాకుండా జీవితంలో కూడా పాటించి చూపిన వాడు.పక్కవాళ్ళకి ఉపదేశీస్తే నరకానికి పోతావు అని భయపెట్టినా నేను నరకానికి పోతే ఏమీ జనాలకు స్వర్గం లభిస్తుంది కదా అని తాను పద్దెనిమిది సార్లు కష్టపడి ప్రయత్నం చేసి గురువులను మెప్పించి సంపాదించిన తిరుమంత్రాన్ని గుడి గోపురం మీదకు ఎక్కి ప్రజలకు ఉపదేశించాడు.
నిత్యం భక్తిగా దేవుణ్ణి కొలిచే శూద్రుడయిన కంచి పూర్ణుని భక్తికి పరవశించి అతని పాదాలని సేవించి భక్తి, శ్రద్దలని మించిన గొప్ప వర్ణం లేదని చాటిన వ్యక్తి.అలాంటి మహాత్ముని జీవితం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.ఆ ప్రయత్నం లో భాగంగా కొండపాక team మరియు BPS audio &video వారు రూపొందించిన ఈ వీడియో song యూట్యూబ్ లో చాలా మంది ప్రశంసలు పొందుతుంది.
రామానుజుల వారి జననం నుండి వారి జీవితం లోని అనేక ముఖ్య సంఘటనలను గురించి రచయిత వంశీకృష్ణ ఈ పాటలో చక్కగా వివరించారు.దానికి సంగీతదర్శకులు సాకేత్ సాయిరామ్ చక్కని బాణీతో స్వర పరచి పాడారు. దర్శకుడు ఉదయ్ కుమార్ చాలా అందమైన లొకేషన్ లలో ఈ పాట వీడియోని చిత్రికరించారు.
బాలేందర్ కెమెరా &ఎడిటింగ్ పనితనం బాగుంది.ఇందులో నటించిన నటులు మాధవ్, రఘు ముఖ్యంగా రామానుజుల వారి పాత్ర పోషించిన Master విజయ్ రామ్ సాయి నటన అద్భుతంగా ఉంది.ఈ పాటకి నిర్మాత :రాధికా రావు, పోస్టర్ డిజైన్ :నాగరాజు.ఈ పాట BPS audio &Video లో అందుబాటులో ఉంది.వీలయితే చూడండి.నచ్చితే షేర్ చెయ్యండి.
pl. watch vedeo……………….. వేయి కనులు చాలవంట
https://youtu.be/2bAzC35WhWs
చాలా వివరంగా సులభంగా అర్ధమయ్యే రీతిలో రాశారు. అభినందనలు