Mass Hero ………..
ధర్మేంద్ర బాలీవుడ్‌లో ఒక మాస్ హీరోగా పేరు పొందారు. ఆయనను ‘గరం’ ధరమ్ అని కూడా పిలుస్తారు, యాక్షన్ హీరోగా, బాలీవుడ్ ‘హీ మ్యాన్’గా ఆయనకో ప్రత్యేక గుర్తింపు ఉంది.1971-1997 మధ్యకాలంలో ఆయన యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఆయా సినిమాలతో ఆయన ఇమేజ్‌ను మరింత పెరిగింది. ‘గరం’ ధరమ్ అనే బిరుదు ఆయన యాక్షన్ ..మాస్ ఇమేజ్‌కు ప్రతీక.
తనదైన నటన, డ్యాన్స్, డైలాగ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకొని, థియేటర్లలో ఈలలు వేయించుకున్న మొదటి తరం హీరోలలో ధర్మేంద్ర ఒకరు. మొదట్లో ధర్మేంద్ర 1960-1968 మధ్యకాలంలో రొమాంటిక్ హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత కాలంలో ఎక్కువగా మాస్ మెచ్చే చిత్రాల్లో నటించారు .
1970 —1980లలో, ధర్మేంద్ర తన యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకు (ముఖ్యంగా ఫూల్ ఔర్ పత్తర్, షోలే, మేరా గావ్ మేరా దేశ్ వంటి చిత్రాలలో) బాగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ , కఠినమైన చూపులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ పాత్రలతో పాటు, ఆయన చుప్కే చుప్కే వంటి కామెడీ చిత్రాలలో సత్యకామ్ వంటి డ్రామా చిత్రాలలో కూడా తన నటనతో మెప్పించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులకు (మాస్ ,, క్లాస్) చేరువ కావడానికి ప్రయత్నించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో, ఆయన 300కు పైగా సినిమాల్లో నటించారు. వేర్వేరు తరాల ప్రేక్షకులను అలరించారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ధర్మేంద్ర వాణిజ్యపరంగా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. హిందీ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా నిలిచారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన తన ఆకర్షణ, పోరాట సన్నివేశాలు, వైవిధ్యమైన పాత్రలతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు, అందుకే ఆయనను ‘మాస్ హీరో’ అని చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాలలో డైలాగ్స్ కూడా ఆయన పాపులారిటీని పెంచాయి.
ధర్మేంద్ర అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌లలో యాదోన్ కీ బారాత్ నుండి “కుట్టే, కమీనే, మెయిన్ తేరా ఖూన్ పీ జావుంగా” షోలేలోని “బసంతి, ఇన్ కుట్టన్ కే సామ్నే మత్ నాచ్నా” వంటివి ఉన్నాయి . ఇంకా ఫూల్ ఔర్ పత్తర్ లో “జో దర్ గయా, సంఝో మర్ గయా” , షోలే లో “ఇస్ స్టోరీ మే ఎమోషన్ హై, డ్రామా హై, ట్రాజెడీ హై” డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.
లైఫ్ ఇన్ ఎ మెట్రో లో “దిల్ కే మామ్లే మే హమేషా దిల్ కి సున్ని చాహియే” ధరమ్ వీర్ లో “మర్ద్ బన్నె కే లియే షేర్ నహీ, హిమ్మత్ చాహియే” లోహా లో “తుమ్హారీ యే గోలీ లోహే కే షేర్ర్ కే పార్ నహీ జా శక్తి”..లోఫర్ లో “నా మెయిన్ గిర్తా హూన్, నా ముఝే కోయి గిరా సక్తా హై… మెయిన్ ఇన్సాన్ హూన్, పత్తర్ నహీ” వంటి డైలాగులు ఆ రోజుల్లో జనాలు బాగా చెప్పుకునే వారు.

