హైవే కిల్లర్‌ మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష !

Sharing is Caring...

అక్కరాజు నిర్మల్ ……………………………………………………….

హైవే కిల్లర్ మున్నాకు ఒంగోలు కోర్టు ఉరి శిక్ష విధించింది. అతడితోపాటు మరో పదకొండు మందికి కూడా మరణ శిక్ష ఖరారు చేసింది. వీరంతా పోలీసులం అంటూ హైవే మీద  లారీలను ఆపి .. డ్రైవర్లను ,క్లీనర్లను దారుణంగా చంపే వారు. తర్వాత లారీలను పార్టుల చొప్పున అమ్ముకునే వారు.  2008 లో వెలుగు చూసిన ఇలాంటి 4 కేసుల్లో 18 మందిపై నేరం నిర్ధారణ అయింది.2008 లో కలకత్తా నుండి ఒక లారీ యజమాని వచ్చి “నా లారీ కనపడ లేదు” అని రిపోర్ట్ ఇచ్చారు.ప్రకాశం ఎస్.పి లారీ మార్టూరు టోల్ గేట్ దాటింది, టంగుటూరు టోల్ గేట్ దాటలేదు అని గమనించి నిర్ధారించుకున్నారు. అక్కడ నుంచి ఈ కేసుపై కన్నేశారు.

అసలేం జరిగింది  ?

ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలో రోడ్డు మీద ఒక పోలీసు అధికారి, పక్కనే సెక్యూరిటీ ఇతర కానిస్టేబుల్స్ రాత్రి పూట హైవే పై వెహికల్ చెక్ చేసేవారు.ఇనుము లోడ్ లారీలను ముఖ్యంగ ఆపే వారు.వెంటనే ఇద్దరు లారీలోని వెళ్ళి డ్రైవర్, క్లీనర్ ని వైరుతో మెడకు ఉచ్చు వేసి చంపేవారు.లారీని తీసుకోని తెల్ల వారే సరికి ఇనుము స్క్రాప్ చేసి తుక్కు క్రింద అమ్మేవారు.లారీ డ్రైవర్, క్లీనర్ ను బండరాయి కట్టి గుండ్ల కమ్మ నదిలో వేసే వారు. లారీ కూడా మాయం చేసేవారు. అంటే రోడ్ పైన ఆపుతుంది పోలీసులు కాదన్నమాట. వాళ్ళే మున్నా భాయ్ ముఠా. ప్రకాశం పోలీసులను హడలెత్తించిన ఈ కేసును సిఐడి కి అప్పగించారు. సిఐడి పోలీసులు గట్టి కృషి చేసి మున్నాని పట్టుకున్నారు.  దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధమైన మున్నా కర్ణాటక లోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో దొరికాడు. అక్కడనుంచి ఒంగోలు జైలుకి తరలించారు.  సిఐడి అందరి మీద ఉన్నకేసును సాక్ష్యాలతో నిరూపించింది. దీంతో ముద్దాయిలలో 12 మందికి ఉరి శిక్ష , 5 గురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కరికి ఏడేళ్ళ శిక్ష విధించారు.. ఈ కేసులో మున్నా వేసిన డబ్బుల ఎరను పోలీసులు ఈసడించి కేసు నిరూపణ చేయించారు.అందుకు పోలీసులకు  సెల్యూట్ చెప్పవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!