IRCTC ..VISAKHAPATNAM – ARAKU RAIL CUM ROAD PACKAGE
అరకు…అదొక భూతల స్వర్గం…అరకు ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే.
వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన అందాలవి. అలాంటి అవకాశం లేని వారి కోసం IRCTC ARAKU TOUR PACKAGE పేరిట ఓ స్పెషల్ ప్యాకేజి తీసుకొచ్చింది. తద్వారా కేవలం ఒక రోజులోనే అరకు చూసి రావచ్చు.
ఈ వేసవి కాలం ఈ స్పెషల్ ప్యాకేజి ద్వారా ఎంజాయ్ చేయవచ్చు. ఈ టూర్ విశాఖ పట్నం నుంచి మొదలవుతుంది. ఇది రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ.. ఈ టూర్ ప్యాకేజి ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ లో అరకు లోని పలు ప్రదేశాలను చూడవచ్చు.
ప్రతిరోజు ఉదయం 06.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రైలు (నెం. 58501) బయలుదేరుతుంది. ఖచ్చితంగా టైం ప్రకారం కదులుతుంది కాబట్టి ముందుగానే స్టేషన్ కి చేరుకోవాలి.
ప్రకృతి అందాలను తిలకిస్తూ సొరంగాలు, వంతెనలు దాటుకుంటూ ఉదయం 10.55 గంటలకు అరకు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి బస్ లో బయలుదేరి ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ సందర్శిస్తారు.
లంచ్ తర్వాత రోడ్డు మార్గం ద్వారా విశాఖ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. విశాఖ వెళ్లే దారిలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ ను సందర్శిస్తారు. అక్కడ నుంచి విశాఖ చేరుకుంటారు. విశాఖ రైల్వే స్టేషన్ లేదా నగర పరిధిలో ఎక్కడైనా దిగవచ్చు.
ప్యాకేజి ధరలు
ప్యాకేజీలో సదుపాయాలు
అరకు వెళ్లేందుకు ట్రైన్ ప్రయాణం, అరకులోని పలు ప్రదేశాల సందర్శన.. విశాఖ రిటర్న్ జర్నీ కోసం నాన్ ఏసీ బస్సు సదుపాయం…. బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్, బొర్రా గుహలకు ఎంట్రీ ఫీజు… ట్రావెల్ ఇన్సూరెన్స్..
ఈ టూర్ కి సంబంధించిన వివరాల కోసం , ప్యాకేజీ బుకింగ్ కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09 లేదా 9281030748 కి ఫోన్ చేసి సంప్రదించండి.