కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
ప్రముఖ గాయని సునీత వివాహం ఖరారు అయింది. డిజిటల్ మీడియా వ్యాపారంలో ఉన్న వీరపనేని రామ్ తో ఇవాళ నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 27న వీరిరువురు పెళ్ళి చేసుకోబోతున్నారు. గత కొద్దీ రోజులుగా సునీత రెండో పెళ్లి గురించి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సునీత …
వరుస ఓటములతో కుదేలు అవుతున్న తెలంగాణా కాంగ్రెస్ కు సారధ్యం వహించేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. నిజంగా అంతమంది రేసులో ఉండటం గొప్పవిషయమే. పార్టీ కోలుకుంటుందని .. పరుగులు దీస్తుందని వారంతా భావించడం మంచిదే. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో ఆ పదవి కోసం పోటీ మొదలయింది. పలువురు పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. గత ఆరేడేళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఎదురుదెబ్బలు …
గర్భ రక్షాంబిగై ఆలయం … ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయం తమిళనాడు లోని తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకా ‘తిరుకరుగవుర్’ లో ఉంది. కుంభకోణం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం రాజరాజచోళుని కాలంలో నిర్మితమైంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేనిప్పటివరకు చూసిన గుడులలో శిల్పరీత్యా కాకుండా నాకెంతో నచ్చిన గుడి ఇది. …
అయ్యా …. సీఎం జగన్మోహనరెడ్డి గారు … నమస్కారం. భజన గురించి … ఆ భజన పర్యవసానాల గురించి అసెంబ్లీ లో మీరు ప్రదర్శించిన చంద్రబాబు గారి భజన వీడియో చూసిన తర్వాత మీతో పాటు ‘ మేము ‘ కూడా నవ్వుకున్నాం. భజన పేరుతో పాలకుడ్ని ఏ విధంగా అధమ స్థాయికి తీసుకురావొచ్చో..ప్రజల్లో ఏ …
గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం గా మారుతున్నబీజేపీ వైపు పలువురు నేతలు చూస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఇతర పార్టీ నేతల పట్ల ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో అక్కడ త్వరలో …
తెలంగాణ లో తెరాస కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోంది. మొన్నటి దుబ్బాక , నిన్నటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం కలుగుతుంది. గతంలో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ ఆస్థాయిలో పుంజుకున్నదంటే ముందుముందు తెరాసకు ప్రత్యామ్నాయంగా …
కొన్నేళ్ళుగా ఊరిస్తూ వచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో తమిళ ప్రజలు ఆయనను ఎంతవరకు ఆదరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజని ప్రకటించారు. కులమతాలకు …
ముందెన్నడూ లేని విధంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. ఆయన అభిమానులైతే సంబరపడుతున్నారు. చంద్రబాబు ఇదే శైలి లో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే విజయమని చెప్పుకుంటున్నారు. నేతల తీరుని బట్టీ కార్యకర్తలు కూడా దూసుకుపోతుంటారు. ఏపార్టీలో అయినా …
జి హెచ్ ఏం సి … ఎన్నికల నేపథ్యంలో కొన్ని టీవీ ఛానెళ్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపని వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాయి. రాజకీయ నాయకుల కంటే ఘోరంగా మాట్లాడాయి. ఓటు వేయని దద్దమ్మలు, పోలింగ్‌కి దూరంగా వున్న చవటలు, సెలవు ఎంజాయ్ చేశారు కానీ ఓటేయడానికి రాలేని సన్నాసులు, బద్ధకజీవులు … అంటూ …
error: Content is protected !!