Do not take the risk……………… ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లను ప్రస్తుత సమయంలో కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల ధరలు తగ్గాయని కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. మూడు రోజుల క్రితం ధరలతో పోలిస్తే ఆదానీ కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. ఆదానీ ట్రాన్స్మిషన్ షేర్ ప్రస్తుతం రూ.1374 వద్ద ,ఆదానీ పవర్ రూ.127వద్ద ,ఆదానీ టోటల్ గ్యాస్ రూ.1394 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ మూడు షేర్లను ట్రేడ్ టు ట్రేడ్ గ్రూప్ లో చేర్చారు.
ఈ గ్రూప్ షేర్లలో ఇంట్రాడే ట్రేడింగ్ అవకాశం ఉండదు. కొనుగోలు చేస్తే తప్పనిసరిగా షేర్లను డెలివరీ తీసుకోవాలి. అలాగే అమ్మితే షేర్లను హోల్డింగ్ లో నుంచి డెలివరీ ఇవ్వాలి.ఈ నేపథ్యంలో ఈ షేర్లలో ఎలాంటి లావాదేవీలు చేయడం మంచిది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదానీ గ్రూప్ షేర్లన్నీ ప్రస్తుతం ఆపరేటర్ల చేతిలో ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. ఈ షేర్ల ధరలు పెరుగుతాయా… మరింత పతనమవుతాయా ? అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఓపికతో వేచి చూడక తప్పదు. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీ ఎత్తున ఈ షేర్లను కొనుగోలు చేశాయని సెబీ కి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
ప్రస్తుత తరుణంలో కొనుగోళ్లు అమ్మకాలకు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. ప్రస్తుతం ఈ షేర్లు అధిక ధరల వద్ద ఉండటమే కాక ఓవర్ బాట్ పొజిషన్ లో ఉన్నాయి. కొంతకాలం ఆగితే కానీ లాభాల స్వీకరణతో ధరలు తగ్గుముఖం పట్టవు. ధర తగ్గినపుడు మాత్రమే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. గ్రూప్ లోని ఆదానీ పోర్ట్స్ … అదానీ ఎంటర్ప్రైజెస్ , అదానీ గ్రీన్ షేర్ల ధరలు కూడా తగ్గుముఖంలోనే ఉన్నాయి.
కాగా NSDL మూడు విదేశీ ఖాతాలను స్తంభింప జేయడంతో ఆదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పతనమైన విషయం తెలిసిందే.
————KNM