ఈ దశలో షేర్ల కొనుగోళ్లు రిస్క్ తో కూడినవే !

Sharing is Caring...

మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్లో ఉంది. ఈ దశలో షేర్లను కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమే.అయినా కొనుగోలు చేయాలనుకుంటే ఇన్వెస్టర్లు ఒకింత జాగ్రత్త వహించాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా షేర్ల లోమదుపు చేయకూడదు.అసలు ఈ దశలో కొనుగోళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. కాదు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మటుకు ముందుగా మనం ఇన్వెస్ట్ చేయ దలచిన షేర్ల పని తీరు ఎలా వుందో తెలుసుకోవాలి. డిసెంబర్ తో ముగిసిన కాలానికి లేదా మార్చ్ తో ముగిసిన ఆర్ధిక సంవత్సరం లో కంపెనీ పని తేరు ఎలా వుందో ? ఎలాంటి ఫలితాలను సాధించిందో తెలుసుకోవాలి.అలాగే ఆ కంపెనీ షేర్లు సక్రమం గా ట్రేడ్ అవుతున్నాయా ? లేదా కూడా గమనించాలి వాల్యుమ్స్ ఎలా వున్నాయో కూడా గమనిస్తే మరీ మంచిది. 

మార్కెట్ పెరిగే తరుణం లో చెత్త షేర్లు కూడా వెలుగు లో కొస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తం గా ఉండాలి. తక్కువ ధరల్లో అందుబాటు లో వున్నాయని .. లాభాలు ఖాయమని  చెత్త షేర్లను కొందరు సిఫారసు చేస్తుంటారు .అలాంటి వాళ్ళ మాటలు విని గుడ్డిగా చెత్త షేర్లలో మదుపు చేస్తే చేతులు కాలడం ఖాయం .అందుకే ఇన్వెస్టర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే కష్ట పడి సంపాదించిన సొమ్ము బూడిద పాలవుతుంది.కొన్ని షేర్లు తక్కువ ధరల్లో  లభ్యమౌతున్నప్పటికి వాటి లో అంతగా కదలిక కూడా వుండదు ఆయా షేర్ల తాలుకు కంపెనీ పనితీరు బాగున్నప్పటికీ ధరలో మార్పు వుండదు, వున్నా స్వల్పం గా ఉంటుంది. అలాంటి షేర్లు కొంటె అవి మన ఓపిక, సహనాన్ని పరీక్షిస్తాయి .

కాబట్టి షేర్ల ను ఎంపిక చేసుకునేటపుడు వాటి 52 వారాల గరిష్ట ధర ఎంత ? కనిష్ట ధర ఎంత ? పరిశీలించాలి .ఈ పరిశీలన లోనే మనకు షేర్ ధరల కదలికలు ఎలా వున్నాయో తెలిసిపోతుంది . ముందే చెప్పుకున్నట్టు అన్ని రకాలు గా షేర్లను పరిశీలించి కొనుగోలు చేస్తేనే  లాభాలు వచ్చే వీలుంటుంది.ఇవేమీ చూడకుండా, వేటినీ పరిశీలించకుండా లాభాలు ఆర్జించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే వుంటారు . వారిని ఆదర్శం గా తీసుకుంటే నిండా మునిగి పోవడం ఖాయం.

కాబట్టి ఇన్వెస్టర్లు పైన పేర్కొన్న అంశాలను గమనం లో వుంచుకోవాలి. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్ లో ప్రవేశించే ముందు పైన తెల్పిన జాగ్రత్తలు పాటిస్తే నష్టాలకు దూరం గా ఉండొచ్చు. ఇక ఇప్పటికే షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు మార్కెట్ పెరుగుతున్న సమయం లో లాభాలు ఆర్జించే వ్యూహాలను అమలు చేయాలి. మన వద్ద నున్న షేర్ల ధరలు పెరుగుతుంటే అమ్మేసుకోవడం మంచిది. లేదా కనీసం ఉన్న షేర్లలో సగం షేర్ల నైనా అమ్మేసి పాక్షిక లాభాలు కాలడం స్వీకరించాలి.
కాగా షేర్లను వదిలించు కోవాలనుకునే వారు  తక్కువ ధరలో అమ్ముకోకుండా  మరి కొన్ని షేర్లను కొని యావరేజ్  చేసుకొని అమ్ముకోవచ్చు .లేదా మరి కొన్నాళ్ళు ఉంచు కొని ధర మరింత పెరిగినపుడు లాభాలు స్వీకరించవచ్చు.

————–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!