Helicopter Crash ………………………………..
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది.ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ దారుణ సంఘటనలో రావత్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆయన సతీమణి మధులిక కూడా ఉన్నారు. కేవలం ఒకరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ హెలికాఫ్టర్ లో మొత్తం పద్నాలుగు మంది ఉన్నారు. సీడీఎస్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఐఎఎఫ్ పైలట్ లు హెలికాఫ్టర్ లో ఉన్నారు. ఎంఐ-సిరీస్ ఛాపర్ తమిళనాడులోని కోయంబత్తూరు.. సూలూరు మధ్య కూలింది.
బిపిన్ రావత్ కోయంబత్తూరు సమీపంలోని సూలూర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ కూలిన పిదప మంటలు చెలరేగాయి.స్థానిక సైనికాధికారులతో సహా అనేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
కాగా ఈ ఘటనలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.భారత వైమానిక దళం ఈ ఘటనను ట్విట్టర్‌లో ధృవీకరించింది.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించింది.
ప్రస్తుతం బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు తొలి సీడీఎస్ ఆయనే. ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. లడ్డఖ్ సంక్షోభ సమయంలో రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధి లా పని చేశారు. మూడు ఆర్మీ దళాలు చైనా ను సమష్టిగా ఎదుర్కోనే వ్యూహాంలో రావత్ పాత్ర చాలా కీలకం. రావత్ ఫోర్‌స్టార్ జనరల్. దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు ఆయన మార్గదర్శి.
రావత్ రక్షణ మంత్రికి ముఖ్య సైనిక సలహాదారు గా పనిచేస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలు రావత్ పరిధిలో ఉంటాయి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ), డిఫెన్స్ ప్లానింగ్ కమిషన్ (డీపీసీ) లాంటి కీలకమైన సంస్థల్లో ఆయన ప్రమేయం ఉంటుంది. సైనికపరమైన కొనుగోళ్లు, శిక్షణ, ఖాళీల భర్తీకి సంబంధించిన బాధ్యతలు ఆయనే చూస్తారు. ఉత్తరాఖండ్‌లోని సైనిక కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.