హిందీలోకి భగవంత్ కేసరి !!

Sharing is Caring...

Can Balakrishna attract Hindi audience ? ……………

హీరో నందమూరి బాలకృష్ణ తాజా హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేస్తున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా హిందీలో బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్పిన సినిమా ఇది.   ‘భగవంత్ కేసరి’ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ, “ నాన్నగారిలా ప్రయోగాలు చేయడం తనకు ఇష్టమే అని చెప్పుకొచ్చారు.

కేసరి లో పాత్ర తన వయసుకు తగిన పాత్ర అని ..  “సాధారణంగా, నేను అలాంటి పాత్రలను అంగీకరించను, కానీ కథలో బలమైన సందేశం ఉంది.  కొత్త సవాళ్లను స్వీకరించడం ఇష్టం కాబట్టి నేను చేయడానికి అంగీకరించాను” అని బాలకృష్ణ వివరించారు. తాను ఊహించినట్టే ఫలితాలు కూడా పాజిటివ్ గా ఉన్నాయన్నారు బాలయ్య. 

ఈ రోజుల్లో ఉత్తర భారత  ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం..  భగవంత్ కేసరి సినిమాతో  హిందీ సినిమా ప్రేక్షకులను బాలకృష్ణ ఆకర్షించగలరా ? అనే చర్చ సినిమా వర్గాల్లో నడుస్తోంది..’భగవంత్ కేసరి’ త్వరలో ఉత్తర భారతదేశం అంతటా థియేటర్లలో విడుదల కానుంది.  హిందీ సినిమా ప్రేక్షకులు రొటీన్ యాక్షన్ చిత్రాలను చూడటానికి ఇష్టపడరు..  అయితే ఈ చిత్రంలోఒక సందేశం ఉన్నందున అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. 

దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ‘భగవంత్ కేసరి’ మూడు వారాల పాటు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమైంది. మొదటి వారంలో  ప్రపంచ వ్యాప్తంగా 99 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. మిగిలిన రెండు వారాల్లో మరో 26 కోట్లు వసూలు చేసింది ..  గ్రాస్125 కోట్లు కాగా 69 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!