ఆ మేకప్,వెలుగుల వెనుక ….

Sharing is Caring...

Recording Dancers………………………………………………….

వెనుకటి తరం మగాళ్ళలొ  రికార్డింగ్  డాన్స్ చూడని వారు… దాని గురించి వినని వారు అరుదు. రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూ తమ అంద చందాలను ప్రదర్శించే వేదిక.పండగ, పబ్బాల  సందర్భంగా  రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లె టూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి. పోలిసుల నిఘా ఎక్కువ కావడం తో ఇప్పుడు రికార్డింగ్ డాన్సులు చాలా రహస్యం గా జరుగుతున్నాయి.

రికార్డింగ్ డాన్స్ అంటే పల్లెటూరి ప్రజలే కాదు పట్నం వాసులు కూడా ఎగబడతారు. ఒకప్పుడు రికార్డింగ్ డాన్సులకు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు.ఈ రికార్డింగ్ డాన్స్ లే పట్నాలలో క్యాబరే డాన్సులుగా  రూపాంతరం చెందాయి. అయితే రాను రాను ఈ డాన్సులు నగ్న ప్రదర్శనలు గా మారడం తో వాటిని ప్రభుత్వం నిషేధించింది.

ఈ నేపధ్యం లొ ఇవి రహస్యం గా జరుగుతున్నాయి. పండగల సందర్భం లొ అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా లోని చిలకలూరి పేట , నరసరావు పేట నాలుగైదు దశాబ్దలు గా ఈ డాన్సులకు ప్రసిద్ధి.

అక్కడే కాదు అన్ని జిల్లాల్లో ఈ డాన్సింగ్ ట్రూపులు పుట్టుకొచ్చాయి.వందల సంఖ్యలో అమ్మాయిలు రికార్డింగ్ డాన్సు నే వృత్తి గా మార్చుకుని  జీవించే వారు. ఆదరణ బాగుండటం తో అదే జీవనాధారం గా మారింది.పోటీ కూడా పెరిగింది.

మొదట్లో సినిమా పాటలకు  నర్తించడమే  వుండేది. పోటీ పెరిగిన క్రమంలో అందచందాల ప్రదర్శన కు తెర లేచింది. ఆ తర్వాత సెమి న్యూడ్ ,ఫుల్ న్యూడ్ షోలు గా మారిపోయాయి.రికార్డింగ్ డ్యాన్సర్లు  హీరొయిన్ల మాదిరిగా పొపులర్ అయిపోయారు.

డిస్కో రాధా ,నాగలక్ష్మి , దంపుడు లక్ష్మి అని  పేర్లు పెట్టుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే వారు. చుట్టూ పక్కల జిల్లాలకు కూడా వెళ్లి  ప్రదర్శనలు  ఇచ్చేవారు. శివ రాత్రి,శ్రీరామ నవమి,వినాయక చవితి పండగలు వచ్చాయంటే   ఎక్కడ చూసిన రికార్డింగ్ డాన్సులు తప్పని సరిగా ఏర్పాటు చేసేవారు.

కటిక పేదరికం లోని మహిళలు ఈ తరహా డాన్సులు చేయడానికి ముందుకొచ్చేవారు. ఆయా మహిళల భర్తలు, సోదరులే దగ్గరుండి మరీ ప్రోత్సహించే వారు. ఇష్టం లేకపోయినా మహిళలు,చిన్న పిల్లలు సైతం ముఖాలకు రంగులద్దుకుని బూతు పాటలకు అనుగుణం గా నర్తిస్తూ ప్రేక్షకులను కవ్విస్తూ, కసేక్కిస్తూ వినోదాన్ని అందించే వారు.

భక్తీ పాటలతో మొదలయ్యే ఈ ప్రదర్శనలు క్రమం గా బూతు పాటలతో హోరేక్కివి.గుడి ఎనక నా స్వామి..గుర్రమెక్కి కూర్చున్నాడు, లేలే నారాజా,మసకమసక చీకట్లో  అంటూ అమ్మాయిలు డాన్సు చేస్తూ మధ్య మధ్యలో కుర్రకారు కు వెర్రేక్కించడానికి గాల్లోకి ముద్దులు విసేరే వారు.

దీంతో జనం ఉర్రూత లూగే వారు. సినిమా తెర మీద చూసిన డాన్సులు ఇక్కడ కళ్ళ ముందు మెదులు తుంటే ప్రేక్షకులు ఓ రకమైన కిక్కు తో కసేక్కి పోయేవారు.కొందరైతే డబ్బులు స్టేజి మీదకు విసేరే వారు.ఇంకొందరు స్టేజి ఎక్కి రూపాయల దండలు అమ్మాయిల మెళ్ళో వేసే వారు.

మరికొందరు  ఈలలు కేకలతో తమ ఆనందాన్ని చాటుకునే వారు.ప్రేక్షకుల్లో స్పందన గమనించి డాన్సర్లు కూడా మరింత గా కవ్వించేవారు. కైపెక్కించే విధంగా అవయవ ప్రదర్శనకు పూనుకునే వారు.ఈ ప్రదర్శనలు  చూసేందుకు  మహిళలు వచ్చే వారు కాదు. ఒక వేళ వచ్చినా వారిని పంపిన తర్వాతనే  దశల వారీ గా ప్రదర్శన మొదలయ్యేది.

నిర్వాహకులు ఆ జాగ్రత్తలు తీసుకునే వారు. సిగ్గు చంపుకుని పొట్ట కూటి కోసం స్టేజిపైన నర్తించే ఈ అమ్మాయిల జీవిత కథల్లో చాలావరకు విషాద కోణాలే. ముఖానికద్దిన మేకప్ వెలుగుల వెనుక అన్ని కన్నీటి వ్యధలే. మసకబారిన జీవిత వ్యధలే. ప్రస్తుతం ఇలా డాన్సులు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది.
ఎక్కువమంది వేరే వృత్తుల్లోకి … కొందరు వ్యభిచారం లోకి వెళ్లిపోయారు.

(ఒక ప్రాజెక్టు లో భాగంగా వారితో పనిచేసినప్పటి జ్ఞాపకాలు)

——————KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!