Bharadwaja Rangavajhala …………………………………….
నాకో అనుమానం ? పీపుల్స్ వార్ పార్టీ ఇప్పుడంటే మావోయిస్ట్ పార్టీగా మారిపోయిందనుకోండి … పార్టీలో అజ్ఞాత జీవితంలోకి పోయే కార్యకర్తలకు పేర్ల మార్పిడి అనే ఓ కార్యక్రమం జరిగేది. సన్యాసులు ఎలాగైతే పూర్వనామమును వదిలేసి శ్రీశ్రీశ్రీ ఏదేదో ఓఓఓ స్వామిగా అవతరించిన తరహాలో మావోయిస్టులు పేరు మార్చుకుంటారు. ఇదంతా దేని కోసం అంటే అజ్ఞాతంలోకి వెళ్లే వ్యక్తి అసలు పేరు ఎవరికి తెలియకూడదని.
ఈ మార్చుకున్న పేరు బయట ప్రపంచానికే కాదు .. మావోయిస్టుల్లో కూడా అందరికి తెలియకపోవచ్చు. అవసరమైన సందర్భం లో మాత్రమే తెలుస్తుంది. ఎవరికి తెలియాలో వారికి మాత్రం ముందుగానే తెలుస్తుంది. మావోయిస్టుల్లో మారు పేర్లతో పాపులర్ అయిన వారు కూడా ఎందరో ఉన్నారు. అలాంటి సందర్భం ఒకటి నా జీవితంలోనూ వచ్చింది. పేరు మార్చుకో అన్నారు. ఏదో ఒక పేరు మీరే పెట్టేయండి అన్నా … వారు పెట్టేశారు. అయిపోయిందనుకోండి.
కొండపల్లి సీతారామయ్య గారి పార్టీ నామము కృష్ణమూర్తి…. ముప్పాళ్ల లక్ష్మణరావు గారి పార్టీ నామము గణపతి…… మా గురువు నెమలూరి భాస్కరరావుగారి పార్టీ నామము మల్లిక్.
అదలాఉంటే నా అనుమానం ఏటంటే …నాకు తెల్సి ఇక్బాల్ అనో … రషీద్ అనో డేవిడ్ అనో … శామ్యూల్ అనో చాలా మంది పెట్టుకోలేదు … అయితే బెంజ్ మెన్ లాంటి కొన్ని పేర్లు కనిపిస్తాయిగానీ … చాలా అధికంగా హిందూ పేర్లే కనిపిస్తాయి. శ్యామ్ , సాగర్ , ప్రసాద్ , శ్రీకాంత్ ఇలాంటి పేర్లు కూడా కనిపిస్తాయి …ఊరికే ఏదో ఆలోచిస్తూ ఉంటే … ఈ అనుమానం పొడసూపింది.
అసలు నేను నా పేరు రంగావఝ్ఝల భరద్వాజ అనేది మార్చేసుకుందాం అనుకుంటున్నా ..తాటి మట్టయ్య అని పెట్టుకుంటే పోతుంది కదా ఈవీవీ తరహాలో … అని నా అభిప్రాయం. ఎందుకంటే … రంగావఝ్ఝల భరద్వాజ అను పేరు లో కులం ఉంది. మతం బీ ఉంది.కాన్షస్ గానో అన్ కాన్షస్ గానో … ఎక్కువ శాతం మారుపేర్లు హిందూ పేర్లుగానే కనిపించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటుందంటారా? నాకైతే తెలియదు … మీకైనా తెలుసునా? కొంతమంది ముస్లిం పేర్లతో కూడా పనిచేశారు.
మరికొందరి పేర్లు
శాఖమూరి అప్పారావు అలియాస్ రవి … సోలిపేట కొండల్‌రెడ్డి అలియాస్ టెక్ మధు, టెక్ రమణ…. నంబల కేశవ రావు అలియాస్ బసవరాజ్. ప్రశాంత్ బోస్ అలియాస్ “కిషన్-డా” … కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, బి. సుధాకర్ అలియాస్ “కిరణ్”…… అరవింద్ జీ అలియాస్ డియో కుమార్ సింగ్ … చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ “ఆజాద్”….. మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ “కిషెంజీ… కదరి సత్యనారాయణ రెడ్డి అలియాస్ “కోసా”,… తిప్పిరి తిరుపతి అలియాస్ “దేవుజీ”, మల్లుజోలా వేణుగోపాల్ అలియాస్ “భూపతి”…. జినుగు నర్సింహ రెడ్డి అలియాస్ జంపన్న
బి. సుధాకర్ అలియాస్ “కిరణ్” ఇలా పేర్లు మార్చుకున్నవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరే పాపులర్అయ్యారు