ఆకర్షణీయం …. ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం !!

Sharing is Caring...

SBI Amrit Kalash
బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త ఫిక్స్ డ్ డిపాజిట్ (Fixed Deposit) స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఇది పరిమిత కాల స్కీం. ‘అమృత్ కలశ్ డిపాజిట్’పేరిట తీసుకొచ్చిన ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లకు7.6 శాతం వడ్డీరేటు లభిస్తుంది.మిగిలిన వారు 7.1 శాతం వడ్డీరేటు పొందవచ్చు.

SBI సిబ్బంది, పింఛనుదారులకు ఒక శాతం వడ్డీరేటు అదనంగా ఇవ్వనున్నారు.’భారతీయ రిజర్వ్ బ్యాంక్ ‘ రెపోరేటును పెంచుతున్న క్రమంలో అందుకనుగుణంగా బ్యాంకులు సైతం రుణ రేట్లను సవరిస్తున్నాయి. అదే సమయంలో డిపాజిట్ రేట్లనూ పెంచుతున్నాయి. ఈ తరుణంలో ఎస్ బీఐ ప్రత్యేక పరిమిత కాల ఫిక్స్ డ్ డిపాజిట్ పధకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అమృత్ కలశ్ కాలపరిమితి 400 రోజులు.. ఈ స్కీంను 2023 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఇది 2023 మార్చి 31 వరకు కొనసాగనుంది. ఆలోపు డిపాజిట్ చేసినవారికి మాత్రమే ఈ ప్రత్యేక 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు 7.6 శాతం వడ్డీరేటు లభిస్తుంది.

రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే 400 రోజులకు రూ.8,600 వడ్డీ వస్తుంది. మిగిలిన వారికి 7.1 శాతం చొప్పున రూ.8,017 వడ్డీ లభిస్తుంది. ఎస్ బీఐ శాఖలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ బీఐ యోనో యాప్ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్ కలశ్ సరిగ్గా సరిపోతుందని నిపుణులు అంటున్నారు. పోస్టాఫీసులో ఏడాది కాలపరిమితితో ఉండే టైం డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వస్తుందని చెబుతున్నారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై ‘మూలం వద్ద పన్ను కోత ఉంటుంది. అవసరాన్ని బట్టి ముందుగానే డిపాజిట్ ను ఉపసంహరించుకునే సదుపాయం ఉంది.

అలాగే డిపాజిట్ చేసిన మొత్తం ఆధారంగా రుణ సదుపాయం కూడా ఉంటుంది.మరోవైపు ఎస్ బీఐ ఇటీవలే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్ డీ లపై 3% నుంచి 7% వరకు వడ్డీని అందిస్తోంది.

2-3 సంవత్సరాల మధ్య కాలానికి ఎఫ్ డీ చేసిన సీనియర్ సిటిజన్లు 7.50% వడ్డీ పొందుతారు. అమృత్ కలశ్ కాకుండా సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. వడ్డీ ఎక్కువగా గిట్టుబాటు అయ్యే ఈ స్కీం ఫై ఓ కన్నేయవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!