‘అరుణాచలం’వెళ్లాలనుకుంటున్నారా?ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే!!

Sharing is Caring...

Telangana tourism spl package…………………. 

కొత్త సంవత్సరం 2025లో అరుణాచల శివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి మూడు రోజులు ఈ టూర్ సాగుతుంది. జనవరి 10 వ తేదీన ఈ టూర్ మొదలవుతుంది.

అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా AC బస్ లో ప్రయాణం సాగుతుంది.

DAY 1 …. సాయంత్రం 6:30 కి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్ లో బయల్దేరుతారు.
DAY 2… మరునాడు ఉదయం ‘కాణిపాకం’ చేరుకుంటారు. ఒక గంట లో ఫ్రెష్ అయి .. వినాయకుని దర్శనం చేసుకుంటారు.ఆ తర్వాత అరుణా చలం (తిరువన్నామలై) కి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అనంతరం అరుణాచలేశ్వరుని దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.

DAY 3…  బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు బయలు దేరుతారు. అక్కడ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ను దర్శిస్తారు. అక్కడే లంచ్ చేస్తారు. సాయంత్రం 4.15 కి హైదరాబాద్ బయలు దేరుతారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ముగుస్తుంది.

అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి .. 

పెద్దలకు రూ. 8000గా ఫిక్స్ చేసారు. చిన్నపిల్లలకు రూ. 6400గా నిర్ణయించారు ..టూర్ ప్యాకేజీకి సంబంధించి ఇంకా వివరాలు కావాలంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఈ ప్యాకేజీలో రవాణా,వసతి, బ్రేక్ ఫాస్ట్ సదుపాయాలు మాత్రమే ఉంటాయి. గుడి దర్శన టిక్కెట్ .. భోజనం ఖర్చులు యాత్రీకులు భరించాలి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!