ప్లానెట్ X లో గ్రహాంతర వాసులు ఉన్నారా ?

Sharing is Caring...

It will take 300 years to reach there …………………………..

గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారా, లేదా ? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంతోకాలంగా ఇదే అంశంపై  చర్చలు జరుగుతున్నాయి. అపుడపుడు చాలా మంది ఆకాశంలో తాము ఎగిరే పళ్లాలను (UFO)లను చూశామని చెబుతూ ఉంటారు.కొందరైతే తాము గ్రహాంతరవాసుల్ని చూశాం అని అంటుంటారు.ఇవన్నీ నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. 

కొన్నాళ్ల క్రితం గ్రహాంతరవాసుల ఉనికిని  డీ ఐ ఏ నిర్ధారించింది. డీ ఐ ఏ అంటే అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ..ఆసంస్థ  రిపోర్ట్ ప్రకారం గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు ఐదు నమోదయ్యాయి. ఒక మహిళ గర్భం దాల్చినట్టు సాక్షులు కూడా ఉన్నారని డీఐఏ వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే  ఇవన్నీనమ్మదగిన నిజాలా ? అనే సందేహాలు కూడా వ్యక్తమైనాయి.

అంతకుముందు అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతరవాసులపై  పరిశోధనలు జరుగుతున్నాయని జోరుగా కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. ఏరియా 51 నిషిద్ధ ప్రాంతంగా ఉండటంతో ఆ ప్రచారం లో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. అయితే అక్కడ పరిశోధనలపై స్పష్టమైన ఆధారాలు లేవు.  

భూమిపై మనుషులు జీవిస్తున్నట్లే ఇతర గ్రహాలపై కూడా గ్రహాంతర వాసులు జీవిస్తున్నారనే అంచనాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కొంత కాలం క్రితం శాస్త్రవేత్తలు మరి కొంత సమాచారం సేకరించారు. వారి అంచనా ప్రకారం.. గ్రహాంతరవాసులు నివసించే గ్రహం యురేనస్ (Uranus) పరిమాణంలో ఉండవచ్చు. ఈ గ్రహం మన సౌరకుటుంబం చివర ఉండి ఉండొచ్చని అంటున్నారు. 

అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా (NASA) శాస్త్రవేత్తలు చెప్పినట్టు మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది.  అదేమిటంటే  “గ్రహాంతరవాసుల రహస్య ప్రపంచం ఊర్ట్ క్లౌడ్ (Oort Cloud) వెనుక దాగి ఉంది. ఇది భూమికి, సూర్యుడికి కూడా చాలా దూరంలో ఉంది. అది సుమారు 2000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ (AU) దూరంలో ఉంది. మనం అక్కడికి చేరుకోవాలంటే 300 సంవత్సరాలు పడుతుందని అంచనా.”

ఇప్పటివరకూ ఊర్ట్ క్లౌడ్‌లో ఏ గ్రహాన్నీ కనుక్కోలేదని .. అయితే అక్కడ ఏలియన్స్ నివసించే అవకాశం ఉంది .. అక్కడ చాలా నక్షత్రాలు ఉన్నాయి. అక్కడ ఏలియన్స్ జీవించే అవకాశం 7 శాతం ఉంది అని నిపుణులు అంటున్నారు.

ఏలియన్స్ ఉంటారని భావిస్తున్న గ్రహాన్ని ప్లానెట్ X (Planet X) అని పిలుస్తారు.1906లో ఖగోళ శాస్త్రవేత్త పెర్సివల్ లోవెల్ “ప్లానెట్ X” కోసం శోధించడం ప్రారంభించాడు. వందేళ్ల తర్వాత  ‘ఆ గ్రహం ఉండే ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 268.15 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాంటిచోట మనుషులు బతకడం చాలా కష్టం. అక్కడ ఉండే ఏలియన్స్ చాలా భిన్నంగా ఉంటారనుకోవచ్చు’ అని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. 

ఇప్పుడు ఆ గ్రహం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అయితే  ప్రస్తుతం నాసా దగ్గరున్న టెక్నాలజీతో ఊర్ట్ క్లౌడ్‌లో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది.  ముందే చెప్పుకున్నట్టు ఆ గ్రహం దగ్గరికి చేరాలంటే 300 ఏళ్ళు పడుతుంది. ఆ లెక్కన పరిశోధకుల జీవిత కాలం ఎంత ఉండాలి.ఒక ఏడాదికాలంలో వెళ్లే అవకాశం ఉంటే ఊర్ట్ క్లౌడ్‌లో ఏముందో తెలుస్తుంది. అలాంటి అవకాశం వస్తుందా ? ఏమో వేచి చూద్దాం. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!