Paresh Turlapati……………… A different director
పటాస్ సినిమాతో ఒక్కో టపాసు పేల్చుకుంటూ దర్శకుడిగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి..ఈయన ఖాతాలో ఫెయిల్యూర్స్ కన్నా సక్సెస్ లే ఎక్కువగా ఉన్నాయి ..సరే ఇతని సినిమా చూసినవాళ్లు బాగుందనో.. బాలేదనో రివ్యూలు రాస్తారు .. అది సాధారణం.
కానీ నేను రాయబోయేది అతని మూవీ మేకింగ్ స్టైల్ అండ్ ప్రమోషన్ టాస్క్ గురించి.. నిజానికి నాకు అనిల్ రావిపూడి లో నచ్చింది ఈ వెరైటీ ప్రమోషన్లే … సాధారణంగా ఏ దర్శకుడైనా సినిమా ప్రారంభాన్ని ఫిల్మ్ నగర్ గుళ్ళోనో .. ఇంకెక్కడో కొబ్బరికాయ కొట్టి ఆవిష్కరించుకుంటాడు అక్కడితో నేరుగా సినిమా షూటింగులు మొదలౌతాయి.
కానీ అనిల్ రావిపూడి రూటే సెపరేటు.. సినిమా ముందు సినిమా తర్వాత కూడా మూవీని డిఫరెంట్ గా ప్రమోట్ చేయడంలో అనిల్ దిట్ట అయిపోయారు .. ఈ మధ్య వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్ కూడా మూవీ టీమ్ తో రోజుకో సెలబ్రిటీ ఇంటికి పోయి డిఫరెంట్ గా చేశాడు. నిజానికి పెయిడ్ యాడ్స్ కన్నా అనిల్ రావిపూడి వెరైటీ గా చేసిన మూవీ ప్రమోషనే బాగా పేలింది.
తాజాగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మెగా 157 బ్యానర్ తో ఓ సినిమా అనౌన్స్ చేసారు.. పూజాదికాలు అయిన తర్వాత ఈ మూవీ లాంచింగ్ కూడా వెరైటీగా ప్లాన్ చేశాడు అనిల్.ఈ తరహా లాంచింగ్ చిరు అభిమానులను బాగా ఆకట్టుకుంది.
ఒక స్టూడియోలో చిరంజీవి గత సినిమాల్లోని కటౌట్లు పెట్టి వాటి పక్కన ప్రొడక్షన్ టీమ్.. రైటర్స్ టీమ్.. మ్యూజిక్ టీమ్.. ప్రొడ్యూసర్స్.. ఇలా అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వాళ్ళని నిలబెట్టి చిరంజీవితో సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకునే కార్యక్రమం ప్లాన్ చేసి ఆఖరికి దర్శకుడిగా తనను కూడా చిరంజీవికి పరిచయం చేసుకోవడం వెరైటీ గా అనిపించింది. టీవీల్లో లక్షలు ఖర్చుపెట్టి ఇచ్చే పబ్లిసిటీ కన్నా ఇటువంటి వినూత్న ప్రయోగాలే జనాలకు ఎక్కువగా రీచ్ అవుతాయి.
ఇక అనిల్ రావిపూడి గురించి చెప్పుకోవాలంటే .. అనిల్ నవంబర్ 23, 1982లో ప్రకాశం జిల్లా చిలుకూరువారి పాలెంలో జన్మించారు. 2004లో బి.టెక్ పూర్తి చేసిన తర్వాత, అనిల్ బంధువైన పి.ఎ. అరుణ్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. ఆ తర్వాత అతను శౌర్యం (2008), శంఖం (2009), కందిరీగ (2011) వంటి చిత్రాలకు సంభాషణ రచయితగా పని పనిచేశాడు.
ఆ తర్వాత మసాలా (2013) ఆగడు (2014) చిత్రాలకు సహ రచయితగా పనిచేశాడు. ‘పటాస్’ స్క్రిప్ట్‌ను తయారు చేసుకుని డైరెక్ట్ చేసాడు. సుప్రీం .. రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరూ, f2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్ సినిమాలు తీశారు