Who are our gods? ……………………………………………….
అసలు దేవుడు లేనే లేనప్పుడు డిస్కషనే వేస్టంటారు హేతువాదులు.. వాస్తవమే.. కానీ, తనకు ఊహకైనా తెలియకుండా ఒక విషయం గురించి మనిషి ఆలోచించటం సాధ్యం కాదు.. ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే, చర్చిస్తున్నాడంటే.. అందుకు సంబంధించి ఏదో ఒక చిన్న ఘటన తనకు అనుభవంలోకి వచ్చి ఉండాలి.
దాన్నుంచే తన సృష్టికి కారణం ఎవరన్న దానిపై మనిషి తపన మొదలై ఉంటుంది. మనిషి మేధస్సును తొలిచి వేస్తున్న దేవుళ్ళ దేవతల గురించిన ఆలోచన కూడా ఈ విధంగా వచ్చిందే అయి ఉండొచ్చు. దేవతలకు సంబంధించిన కథలు, బొమ్మలు హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఆలయాల పైనా ఎన్నో కనిపిస్తాయి.
వేల ఏళ్ల నాటి నిర్మాణాలపైనా చిత్రాల రూపంలో దేవుళ్ళ .. దేవతల కథలు కనిపిస్తాయి. రకరకాల రూపాల్లో, రథాలపైనా, గుర్రాల పైనా, యుద్ధం చేసుకుంటున్న బొమ్మలు చాలానే కనిపిస్తాయి. మన ఇతిహాసాల్లో ఆకాశ వాణి పలుకుతుంది.. భవిష్యవాణి చెప్తుంది.. దేవుడు ఆగ్రహిస్తే, మబ్బులు ఉరుము తాయి.. మెరుపులు మెరుస్తాయి.. పిడుగులు పడతాయి. దివి నుంచి గంగ భువికి దిగి వస్తుంది.. భూమి సస్యశ్యామలమవుతుంది.. ఇవన్నీ ఆకాశం నుంచే జరుగుతున్నాయి.
అంటే భూమికి ఎగువన ఉన్న లోకాల నుంచి..ఇలాంటి కథనాలు మన హిందూయిజం లో మాత్రమే కాదు. క్రైస్తవ చరిత్రలోనూ ఇది మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.. అతీంద్రియ శక్తులు ఉన్నట్లు క్రిస్టియానిటీకి చెందిన ప్రాచీన పెయింటింగ్స్ లో కనిపిస్తుంది. ఏసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న సందర్భంలో ఆకాశం నుంచి దివ్యమైన వెలుగు ఆయనపై ప్రసరించినట్లు ఒక కథనం ఉంది.
అంతే కాదు క్రీస్తును శిలువ వేస్తున్న సందర్భంలో దేవతలు భూమి పైకి వచ్చి ఆ సన్నివేశానికి సాక్షులుగా నిలిచినట్లూ చెప్తారు.. ఈ కథలు, కథనాలన్నీ కూడా దేవుళ్ళ .. దేవతల మూలాలను చెప్తున్నాయి.ఈ కథలన్నింటికీ ఆధారాలు ఏమున్నాయి..? అంటే ఇవాళ ఆధునికంగా సైన్స్ పరిశోధిస్తున్న, ప్రస్తావిస్తున్న ఏలియన్స్ ఈ కథనాలకు మూలమేమో.
విశ్వంలో ఎక్కడో ఏదో ఒక చోట ఉన్నారని భావిస్తున్న గ్రహాంతర వాసులే మతాలు నమ్ముతున్న దేవుళ్ళు .. దేవతలా? వీళ్లనే, అంటే ఈ గ్రహాంతర వాసులనే మన ప్రాచీనులు దేవతలుగా భావించి ఉండవచ్చు. స్టీఫెన్ హాకిన్స్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా ఏలియన్స్ ఉన్నాయన్న మాటే వాస్తవమైతే వీళ్లను మన పూర్వీకులు చూసి ఉంటారా? వీళ్లు మనకన్నా శక్తివంతులైతే వాళ్ల నుంచి మేలును పొందారా?
గ్రహాంతర వాసులు ఎలా ఉండవచ్చన్నదానికి ఆధారాలు మనకు స్పష్టంగానే లభిస్తున్నాయి. ఏసుక్రీస్తుకు పూర్వం అయిదు వేల ఏళ్ల సంవత్సరాలకు పూర్వమే గ్రహాంతర వాసులను నాటి ప్రజలు గుర్తించారు. వాళ్లరూపు రేఖలను భావితరానికి అందించారు ఇరాన్‌లో కొంతకాలం క్రితం తవ్వకాల్లో బయట పడ్డ విగ్రహాలు ఇవే.
ఈజిప్ట్ పిరమిడ్లలోనూ ఇలాంటి బొమ్మలు మనకు కనిపిస్తాయి…మన దేశంలోనూ, మొహంజదారో ప్రాంతంలోనూ ఇలాంటి చిత్ర విచిత్రమైన వేషాలు ఉన్న విగ్రహాలు, చిత్రాలు కనిపిస్తాయి. ఆబొమ్మల్లో ఉన్నది ఏలియన్సే అయితే, వీళ్ళు మానవాళికి మేలు చేయటం కోసమే భూమి మీదకు మరో గ్రహం నుంచి వచ్చి ఉంటే, వారిని మన వాళ్ళు దేవుళ్ళు .. దేవతలుగా భావించి ఉండవచ్చు. వాళ్ళు మనకన్నా శక్తివంతులు కావటం వల్ల వారిని పూజించి ఉండవచ్చు.
courtesy .. unknown writer