ట్యూన్స్ రిపీట్ చేయడంలో స్పెషలిస్టు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………………………………..   

తను చేసిన ట్యూన్లనే మరోసారి రిపీట్ చేసేయడం ఆయనకో సరదా. అలా రిపీట్ అయిన పాటల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అన్నగారి వేటగాడు సినిమాలో కొండమీద సందమామ పాట గుర్తుంది కదా. ఆ పాట ట్యూనుకు ఆ టైమ్ కుర్రాళ్లందరూ ఊగిపోయారు.

సలీం డాన్స్..రాఘవేంద్రరావు టేకింగ్ అదిరాయి. అయితే ఈ పాటకూ ఓ ఒరిజినల్ ఉంది.వేటగాడు కన్నా రెండు మూడేళ్ల ముందు విడుదలైన విచిత్ర జీవితం సినిమాలో బంగినపల్లి మామిడి పండు…మంగినపూడి మల్లెచెండు అనే పాట ఉంది. ఆ పాటకూ జనం అప్పట్లో చాలా ఇంప్రస్ అయ్యారు.

అక్కినేనికి చక్రవర్తి పనిచేసిన మొదటి సినిమా కూడా విచిత్ర జీవితమే. అందులో నీ ఓ రబ్బడి సుబ్బయ్య నువ్ పుట్టిందే నా కోసం బిట్ వినగానే మీకు నీ ముక్కుకు తాడెయ్య… అనే వేటగాడు బిట్ గుర్తొస్తుంది చూడండి.

అదే చక్రవర్తి ….వెంటవెంటనే రిలీజ్ అయిన రెండు సినిమాల్లో ఒకే ట్యూన్ కొట్టేసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రేమతరంగాలు సినిమాలో కృష్ణంరాజు పాడే సోలో ఒకటుంటుంది. నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం అంటూ సాగుతుందా పాట.

ప్రేమతరంగాలు  రిలీజ్ అయిన వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన సర్దార్ పాపారాయుడులోనూ అదే ట్యూన్ తో ఓ డ్యూయట్ ఉంటుంది.ఉయ్యాలకూ ఊపొచ్చిందీ ఊపిఊపీ చంపేస్తోందీ అంటూ …. చక్రవర్తి చక్రం తిప్పిన రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే . 

వేటూరి చెప్పిన సంగతిది. ఓ సారి వేటూరి పనిమీద బయటకు వెళ్తూ ఇంట్లో ఉన్న తన అసిస్టెంటుకు రెండు కాగితాలు ఇచ్చి సత్యం పంపారు అని వచ్చిన వారికి ఏ కాగితం ఇవ్వాలో , చక్రవర్తి పంపారు అని వచ్చిన వారికి ఏ కాగితం ఇవ్వాలో స్పష్టంగా చెప్పి అప్పగించారట. కానీ పొరపాటు జరిగిపోయింది.

చక్రవర్తికి వెళ్లాల్సిన కాగితం సత్యానికీ …. సత్యానికి వెళ్లాల్సిన కాగితం చక్రవర్తికీ వెళ్లిపోయాయి. మర్నాడు సత్యం ఫోన్ చేసి ఏంటి గురూ … పాట అలా ఉంది ట్యూనుకు ఒదగలేదు. కొంచెం మార్చుకుంటూ వెళ్లాను … నువ్వలా రాయవే అనిపించింది అన్నారట. చక్రవర్తి అసలు ఆ విషయమే పట్టించుకోలేదట.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!