ఇంతకూ… ఆత్మలున్నాయా అంకుల్ ?

Sharing is Caring...

సెల్ ఫోన్ రింగ్ అయింది. అతగాడు ఫోన్ ఎత్తాడు. 
“హలొ అంకుల్ హౌ అర్ యు ?”
“ఏం చిన్న బాబు ఎలా ఉన్నావు ?”
“ఏదో తమరి దయ వల్ల ఇలా ఉన్నాను అంకుల్ “
“అయితే ఇంకా కోపం పోలేదన్నమాట “
“ఏదో పిల్లోడు .. పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నాడు .. ఎంకరేజ్ చేయకుండా . నా ఉత్సాహం మీద నీళ్లు జల్లారుగా.”  
“అదొక వ్యూహం లే బాబు .. చెప్పినా నీ కర్ధంకాదు. అసలు ముందు రోజులన్నీ నీవేగా .. ఒక్క ఆంధ్రా ఏంటి ? దేశ వ్యాప్తంగా పాదయాత్ర ప్లాన్ చేద్దాం.” 
“ఓహో అలాగా ?అంటే ఢిల్లీ వెళ్లి కూర్చోవచ్చు అంటారా ? “
“అదెంత పని ? “
“మా డాడీ వల్ల కానీ పని నా వలన అవుతుందా ?”
“మీ నాన్నఅంటే  హిందీ రాదని భయపడ్డారు ? లేకుంటే ఈ పాటికి ఎర్ర కోటపై జెండా ఎగురవేసేవాడు.” 
“సర్లే కానీ ఆమె ఏంటీ ? ఆత్మతో మాట్లాడాను అంటుంది . ఆ వార్త మన మీడియాలో కవర్ చేయలేదా ?”
“ఆమె ఎవరు ? బాబూ ?” 
“అదేనండీ మా డాడీ ని పట్టుకుని వెన్నుపోటు పొడిచాడని పదే పదే విమర్శిస్తోంది కదా ఆమె. “
“ఓహో … ఆవిడా ? అర్ధమైంది. అవునూ .. నువ్వు కూడా వెన్నుపోటు అంటున్నవ్ ఏంటి ? “
“వెన్నుపోటే కదా అది ?”
 “రామ రామ నువ్వు కూడా ఆ మాట అంటే మీ డాడీ ఫీలైపోతాడు మరి. మన భాషలో అధికార మార్పిడి అనాలి.” 
“దానికి అంత అందమైన పేరు పెట్టారా ?” 
“పెట్టింది నేనే మరి.”
“సర్లే .. ఇంతకూ ఆత్మలు ఉన్నాయా ? లేవా ? అది చెప్పండి అంకుల్.” 
“ఆమె ఏదో పబ్లిసిటీ కోసం అలా చెప్పి ఉండొచ్చు. నిజంగా ఉంటే మీ నాన్నకు కూడా కనబడాలిగా “
“అవునూ పాయింటే మరి.. అంటే ఆత్మలు లేవంటారా ?” 
“అంతే కదా”
 “అవునూ…  ఇంకో డౌట్… “
“అడుగు .. ఆలస్యమెందుకు ?” 
“ఆ మధ్య ఆ జగన్నాధం రాత్రిళ్ళు ఆత్మలతో మాట్లాడతారని మీరు రాసినట్టు గుర్తు.” 
“ఆ ఏదో రాస్తుంటాం .. మనకైతే లేవు .. వాళ్లకయితే ఉన్నాయి. ఆ లెక్కలు వేరు. నీకర్ధం కావు. “
“అంతే అంటారా ? “
“అంతే కదా ..”.  “దీన్ని బట్టి చూస్తుంటే లేనిది ఉన్నట్టు .. ఉన్నది లేనట్టు మీరు రాస్తున్నారు అంతేనా ?”
 “ఇప్పటికి దారికొచ్చావు బాబూ .. ఈ మధ్య షార్ప్ గా తయారవుతున్నావే ?” 
“అవును అంకుల్..మీరు చెప్పిందాన్ని బట్టి  మీరు రాసేది అంతా హంబగ్. మా విషయంలో కూడా అంతే కదా !!”
“ఏమన్నావు ?? హలొ … హలొ …”. అటునుంచి ఫోన్ కట్ అయింది … వెంటనే ల్యాండ్ లైన్ కి చేసాడు. ఎవరో ఫోన్ ఎత్తారు.. “చిన్న బాబు కి ఫోన్ ఇవ్వండి.”
 “బాబు నిద్రపోతున్నారండీ. పది గంటలకు పడుకున్నారు. భోజనం టైమ్ కి లేపమన్నారు.”
మరి నాకు ఫోన్ చేసిందెవరు ? కొంప దీసి  పెద్దాయన ఆత్మకాదు కదా అని అనుకున్నంత లోనే ఆ గోడ మీద ఎవరిదో నీడ కదిలినట్టు అనిపించింది.తటాలున వెనక్కి తిరిగాడు … ఎవరూ కనిపించలేదు. డోర్ దగ్గర కెళ్ళి చూసాడు. ఎవరూ లేరు. మరి నీడ ఎవరిది ? 

——–KNMURTHY

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!