వెంటనే అమ్మేసుకోండి !!

Sharing is Caring...

Decipher labs….. 

డెసిఫర్ ల్యాబ్స్ … హైదరాబాద్ కి చెందిన కంపెనీ. ఈ కంపెనీ అసలు పేరు కంబాట్ డ్రగ్స్ తర్వాత పేరు మారింది. వివిధ బల్క్ డ్రగ్స్, కెమికల్స్, ఫినిష్డ్ ఫార్ములేషన్స్‌ తయారీ లో నిమగ్నమైంది.అలాగే పలు కంపెనీల కోసం బ్రాండెడ్ ఫార్ములేషన్స్ ను ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ పనితీరు అంత గొప్పగా లేదు.

కానీ షేర్ ధర గత ఆరునెలల కాలంలో బాగా పెరిగింది. నవంబర్ నుంచి అసాధారణంగా పెరిగింది. పని తీరుతో సంబంధం లేకుండా షేర్ ధర దూసుకుపోయింది. గత మూడు నెలల కాలంలో  316 శాతం మేరకు ధర పెరిగింది. జూన్ లో రూ. 40 వద్ద ఉండగా నవంబర్ చివరికి రూ.45 కి చేరుకుంది. డిసెంబర్ చివరికి రూ. 139 కి పెరిగింది.

ప్రస్తుతం రూ.132 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం షేర్లు సర్క్యూట్ లిమిట్ లో ఉన్నాయి . కాబట్టి కొన్నిరోజుల పాటు ధర పెరగడం కష్టమే. ప్రమోటర్లు షేర్లను విక్రయిస్తున్నారని తెలుస్తోంది.కంపెనీ జూన్ 21 తో ముగిసిన త్రైమాసికంలో 13.40 కోట్ల అమ్మకాలపై 66 లక్షల లాభాలను ఆర్జించింది. అంతకు ముందు నష్టాల్లో నడిచింది.

ఈ కంపెనీ  మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 141.10 కోట్లు. ఫార్మాస్యూటికల్స్ రంగంలో, దీని మార్కెట్ క్యాప్ ర్యాంక్ 101. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ. 145 కాగా కనిష్ట ధర రూ. 27 మాత్రమే. టార్గెట్ ౩౦౦ పైనే అని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు చెబు తున్నాయి. కానీ అంత ధరకు చేరుకోవడం కష్టమే.

రూ. 40–50 ధర వద్ద  ఈ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు  వాటిని వెంటనే అమ్మేసుకుని లాభాలు స్వీకరించవచ్చు. ఇంకా పెరుగుతుందని కూర్చుంటే నష్టపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కంపెనీ పనితీరు మెరుగుపడి ..  షేర్ ధర  తక్కువలో ఉన్నపుడు .. కావాలంటే కొనుక్కోవచ్చు. పాక్షికంగా కాకుండా పూర్తిగా అమ్మేసుకోవచ్చు. ఈ దశలో ఇన్వెస్ట్మెంట్ పూర్తి గా రిస్క్ తో కూడుకున్నదని చెప్పుకోవచ్చు.  

————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!