Title super ..but ……………………
అద్భుతం టైటిల్ బాగుంది … కానీ సినిమాయే కొంత గందర గోళం. కథా రచయిత కొత్త ఆలోచన బాగుంది కానీ అది ప్రేక్షకులను ఒప్పించే విధంగా లేదు. ఇద్దరు ఒకే ఫోన్ నంబర్ వాడటం..ఒకే ప్రదేశంలో వేర్వేరు టైమ్ పీరియడ్స్‌లో ఉంటూ ఒకరితోఒకరు మాట్లాడుకోవడం .. ప్రేమలో పడటం అనే పాయింట్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది.
ఇలా గతంలో జరిగాయి అని ఒక శాస్త్రవేత్త పాత్ర ద్వారా చెప్పించారు. కానీ అది అంత కన్విన్సింగ్ గా లేదు. వేరువేరు టైమ్ పీరియడ్ లోనే కథ సుదీర్ఘం గా నడుస్తుంది. దీంతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. బోర్ ఒక్కటే కాదు కన్ఫ్యూషన్ కూడా తోడవుతుంది. మొదటి భాగం వరకు పర్వాలేదు కానీ అక్కడ నుంచి కథనం స్లో గా సాగుతుంది.
హీరో హీరోయిన్ల మధ్య కొన్నిలవ్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్ బాగుంది. అది తప్పితే కథలో అద్భుతమైన మలుపులు అంటూ లేవు. ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలు లేవు. హీరోయిన్ పెళ్లి చూపుల సన్నివేశాల కామెడీ పర్వాలేదు.మల్లిక్ రామ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. విద్యాసాగర్ కెమెరా పనితీరు మెచ్చుకోదగిన రీతిలో ఉంది.
రథన్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ .. హిట్ సాంగ్స్ లేవు. హీరో తేజ సజ్జా కష్టపడ్డాడు. అవకాశాలు దొరికితే టాలెంట్ చూపించగలడు. హీరోయిన్ శివాని పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్స్లో బాగానే చేసింది. లక్ష్మి భూపాల డైలాగులు బాగున్నాయి. మంచి టీమ్ ఉంది కానీ పట్టు ఉన్న కథ .. కథనం లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్.
నిజానికి స్టోరీ లైన్ ఆసక్తికరమైనది. కానీ దాన్ని మలుపులు తిప్పడానికి మరింత కసరత్తు చేస్తే బాగుండేది. లోపం అక్కడే కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు గతంలో కొన్ని వచ్చాయి. ఈ సినిమా లో లవ్ స్టోరీ పైనే రచయిత దృష్టి పెట్టడంతో కథనం నీరసంగా సాగుతుంది.
ఈ కథను మరిన్ని ఆకర్షణీయమైన మలుపులు తిప్పే ఛాన్స్ ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. ఎక్కడా కూడా లాజిక్ కు కథ అందదు… ముగింపు కూడా అంత గొప్పగా లేదు. ఇవన్నీ ఆలోచించకుండా చూడాలనుకుంటే .. హాట్ స్టార్ చందాదారులైతే ఒక సారి చూడవచ్చు.