అంతరిక్షం లోకి తెలుగు అమ్మాయి !

Sharing is Caring...

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహిస్తోన్న ‘అంతరిక్ష యానం’ లో అమెరికా భారతీయ సంతతికి చెందిన శిరీష బండ్ల పాల్గొంటున్నది. శిరీష తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి.ఈ నెల 11 న వీ ఎస్ ఎస్ యూనిటీ వ్యోమ నౌక ద్వారా అంతరిక్షంలోకి టీమ్ తో కలసి ప్రయాణించబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కి చెందిన  డాక్టర్ మురళీధరరావు డాక్టర్ అనురాధ దంపతుల కుమార్తె ఈ శిరీష. ఈ కుటుంబం చాలా కాలం క్రితం అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయింది.  శిరీష చదువు ..ఉద్యోగం అన్నీ అక్కడే. అంతరిక్షంలోకి వెళుతున్న ఆరుగురి టీమ్ లో శిరీష ఒకరు. కల్పనా చావ్లా ఇండియన్ అమెరికన్ సునీత విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయ సంతతి మహిళల సరసన శిరీష చేరారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయి.

అపర కుబేరుడు అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ కంటే ముందే అంతరిక్షం లోకి వెళ్లేందుకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ సన్నహాలు చేసింది. అనుమతులు పొందింది. రిచర్డ్ బ్రాస్నన్ ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వర్జిన్ గెలాక్టిక్, వర్జిన్ ఆర్బిట్ వంటి స్పేస్ రీసెర్చ్ సంస్థలు ఈ గ్రూప్ లో ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేసుకున్న సంస్థ తరపున ఆరుగురు అంతరిక్షంలోకి వెళుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని సంస్థలు అంతరిక్షంలోకి వెళ్లేందుకు పోటీ పడతాయి.  అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ టీమ్ ఈ నెల 20 న స్పేస్ లోకి వెళ్లవచ్చని తెలుస్తోంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!