వామ్మో .. ఆ మిషన్ వచ్చిందంటే ?

Sharing is Caring...

Goverdhan Gande …………………………………………

The machine to find meaning in silence………ఇకపై మౌనానికి అర్ధాలు వెతుక్కోనక్కర లేదట. ఆ అర్ధాలను కనుగొనే యంత్రాన్ని సైన్స్( Jawahar lal Nehru centre for Advanced scientific Research/Banglore) రూపుదిద్దిందట! ఓ మనిషి తన మదిలోని భావాలను వెలుపలికి వ్యక్తం చేయకపోవడాన్ని సమాజం రకరకాలుగా అర్ధం చేసుకోవడం మనందరికీ తెలుసు కదా.ఇక పై ఆ అవసరం ఉండదట! మౌనాన్ని ఇప్పుడు… అంగీకారంగా.. అర్ధాంగీకారంగా.. అర్ధం చేసుకుంటున్నాం కదా! పలు రకాల అన్వయాలు చేసుకుంటున్నాం కదా! ఎవరికి తోచిన విధంగా వారు అర్ధం చేసుకుంటున్నాం కదా!

ఎవరికి నచ్చిన విధంగా వారు అన్వయించుకోవడం చూస్తున్నాం కదా.  ఇకపై ఆ అవసరం ఉండదని ఆ పరికరాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదొక రకంగా.. లై-డిటెక్టర్ లాంటి పరికరం అనుకోవచ్చునేమో? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం తో ఈ పరికరం పని చేస్తుందట.  దీనిలో ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను వినియోగించారట. మెదడు లోని భావాలను ఇది గ్రహించి మాటల రూపంలో చెబుతుందట. 

నేర పరిశోధనకు ఇది ఉపకరిస్తుందనడంలో అనుమానం ఏమీ లేదు. కానీ ఈ పరికరాన్ని నేర పరిశోధనకు వినియోగిస్తారా?
తమకు నచ్చని వారి మదిలో ఏముందో తెలుసుకునేందుకు, వేధించేందుకు, తమకు అంగీకారయోగ్యం కానీ భావజాలం ఉందేమో తెలుసుకొని,దాని ఆధారంగా వారిని వేధించడం ద్వారా అణచివేత కు ఉపయోగిస్తారా అనేది ఆయా వ్యవస్థలు, సమాజాల మానసిక స్థాయి,పరిణతులను ప్రకారం ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం…..మానవ కల్యాణానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారా? లేక దుర్వినియోగపరుస్తారో ?

అదలావుంటే  మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనే మాట నిజమే. చిరాకు,కోపం,వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దు మణుగుతాయి. అయితే మౌనం అన్ని సందర్భాలలో సమర్ధనీయం కాదు. కీలక సందర్భాలలో నోరు విప్పాలి. లేదంటే మౌనం అంగీకారం కిందకు వస్తుంది. కాబట్టి అన్నివేళలా మౌనం మంచిది కాదు. ఈ మౌనంలోకూడా మూడు రకాలుంటాయి. అవి వాగ్ మౌనం, అక్ష మౌనం, కాష్ట మౌనం.. వీటి గురించి మరోమారు తెలుసుకుందాం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!