కన్ఫ్యూజ్ చేసే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Malayalam mystery thriller!…….

“సంభవం అధ్యాయం ఒన్ను” (సంభవం – మొదటి అధ్యాయం) ”  మలయాళ మిస్టరీ థ్రిల్లర్..ఈ సినిమా టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇదే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి.  సినిమాను ఏకబిగిన చూసినా కొంత కన్ఫ్యూషన్ కి ప్రేక్షకుడు గురవుతాడు. సినిమాలో ,సస్పెన్స్ ,థ్రిల్ కలిగించే అంశాలు ఉన్నాయి. ఓపిగ్గా చూడాలి.

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని ‘వెల్లూర్ కాడ్’ అనే అడవి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ అడవిలోకి వెళ్లిన వారు తిరిగి రారనే ప్రచారం ఉంటుంది. అడవిలో ఏం జరుగుతుందనేది మిస్టరీ. ముగ్గురు కేరళ పోలీసులు ఒక మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయడానికి ఆ అడవిలోకి వెళ్లినప్పుడు, వారు ఊహించని రీతిలో టైమ్ లూప్‌లో చిక్కుకుపోతారు. అక్కడి వింత సంఘటనలు, కాకి ముఖం ఉన్న ఆలయం వెనుక ఉన్న రహస్యమేమిటనేది సినిమా ప్రధానాంశం.

సినిమా ఆరంభంలో అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు.. టైమ్ లూప్ సీన్లు ప్రేక్షకులు అర్థం చేసుకోవడం కష్టమే.సినిమా మొదటి సగం చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, అడవిలోకి వెళ్లే వరకు సాగే సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.ఒకే సన్నివేశం మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు సామాన్య ప్రేక్షకుడు కన్ఫ్యూషన్ కి గురవుతాడు. 

ఎక్కడ లూప్ మొదలైంది, ఎక్కడ ముగిసింది అనేది స్పష్టంగా చూపించడంలో కొన్ని చోట్ల క్లారిటీ లోపించింది. సైన్స్ ఫిక్షన్,  మిస్టరీని కలిపే క్రమంలో కొన్ని సీన్లలో లాజిక్ సరిగ్గా కుదరలేదు. ముఖ్యంగా అడవిలో ఆ ముగ్గురు పోలీసులు ప్రవర్తించే తీరు కొన్నిసార్లు సహజత్వానికి దూరంగా అనిపిస్తుంది. 

ముప్పై ఏళ్ళ క్రితం చనిపోయిన మనిషి వాకీ టాకీ లో ఎలా మాట్లాడతాడు అనేది మిస్టరీ..ఈ అంశం చుట్టూ కథ నడుస్తుంది కాసేపు. సస్పెన్స్ కొనసాగించడానికి వాకీ టాకీ ని ఉపయోగించుకున్నారు.

మలయాళంలో టైమ్ లూప్ జానర్‌ను ప్రయత్నించడం ఒక సాహసమే. దర్శకుడు జితు సతీషన్ మంగళత్తు ఆలోచన బాగుంది. మరింత క్లారిటీ కోసం కసరత్తు చేసి ఉండాల్సింది. నవీన్ నజోస్  సినిమాటోగ్రఫీ అద్భుతమని చెప్పుకోవాలి. అడవిని భయంకరంగా చూపడం లో ఆయన కృషి ఫలించింది.అడవిలోని లోతైన ప్రదేశాలు, అక్కడి నిశ్శబ్దాన్ని సినిమాటోగ్రఫీ ద్వారా చాలా బాగా చూపించారు. గొడ్విన్ థామస్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్.

సినిమా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. కథలో థ్రిల్ ఉన్నప్పటికీ, పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు (ముఖ్యంగా తండ్రి-కొడుకుల బంధం) లోపించాయి.కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీద పెట్టిన శ్రద్ధ పాత్రల మధ్య భావోద్వేగాల మీద పెట్టలేదు. 

పోర్చుగీసు యువతి, ఫారెన్‌ యువకుడి హత్యతో సినిమా ఆరంభించి ఆ హత్య వెనక కారణాన్ని చెప్పకుండా కథను మరో కోణం లో నడిపించాడు దర్శకుడు.సినిమా ముగింపు అందరికీ నచ్చేలా లేదు. కొంతమందికి అది అసంపూర్తిగా అనిపించవచ్చు..చాలా సీన్స్ రిపీట్ అవడం మూలానా ప్రేక్షకులు కన్ఫ్యూషన్ కి గురవుతారు.

సినిమా  మేకింగ్ పరంగా బాగున్నా, కథను నడిపించే విధానంలో లోపాలు ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తాయి. సంభవం – రెండవ  అధ్యాయం తీస్తారని టైటిల్ ద్వారా దర్శకుడు ఒక హింట్ ఇచ్చారు. 
అస్కర్ అలీ, వినీత్ కుమార్, సిద్ధార్థ్ భరతన్, నీతూ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.అందరూ బాగా చేశారు. 
ఈ చిత్రం జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!