ఏమిటీ ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ స్కామ్ ?

Sharing is Caring...

 Pardha Saradhi Upadrasta ………………

ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ … ఇది ఒక్క రాష్ట్రానికి, ఒక్క గ్రామానికి పరిమితమైన విషయం కాదు. ఇది దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా సాగుతున్న ఒక వ్యవస్థాత్మక కుట్ర.

మహారాష్ట్ర – శేందుర్‌సనీ గ్రామం (యవత్మాల్ జిల్లా) కేవలం 1500 మంది జనాభా ఉన్న ఒక చిన్న గ్రామంలో , మూడు నెలల్లోనే 27,000+ జననాలు నమోదుఅయ్యాయి. తతంగమంతా తెలిసి అధికారులు అవాక్కయ్యారు. అక్రమ కార్యకలాపాల కోసం నకిలీ జనన ధ్రువపత్రాలు సృష్టించినట్టు అనుమానించారు.

స్కామ్ పనిచేసే విధానం (Common Formula)

ఒక ఇంట్లో రెంట్ కి ఉంటున్నట్లు ఎలెక్టీసిటీ బిల్ ఉంటే చాలు, VRO ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ వస్తుంది.ఒక సారి ఒక సర్టిఫికెట్ వస్తే ఇక దాని ద్వారా వేరేవి సులభతరం అవుతాయి.తద్వారా ముందుగా ఫేక్ ఆధార్… ఆ ఆధార్ ఆధారంగా పాత తేదీతో జనన సర్టిఫికేట్..జనన సర్టిఫికేట్ ఉంటే భారత పౌరుడు అన్నముద్ర…  ఆపై ఓటర్ ID, రేషన్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు అన్ని పుట్టుకొస్తాయి.  

ఇదంతా గమనించే మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆధారంగా రివర్స్‌గా పొందిన జనన సర్టిఫికేట్‌లు చెల్లకుండా చేసింది. ఎందుకంటే ఇవే స్కామ్‌లకు ప్రధాన మార్గంగా మారాయి. అసలు పద్ధతి … పుట్టగానే జనన సర్టిఫికెట్ తీసుకోవాలి.దాని ఆధారంగా ఆధార్ కార్డులు వస్తాయి. కానీ ముందు ఆధార్ పుట్టించి తరువాత జనన సర్టిఫికెట్ కాదు. 

ఇదొక్క మహారాష్ట్ర సమస్య కాదు ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల్లో బయటపడ్డాయి.ఇంకా పడుతున్నాయి.. అస్సాం……. • NRC సమయంలో వేల సంఖ్యలో బ్యాక్‌డేటెడ్ జనన ధ్రువపత్రాలు • అక్రమ వలసదారులకు పౌరసత్వ ఆధారం కల్పించే ప్రయత్నాలను మొత్తము REVERIFY చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్…… • ఒకే అడ్రస్‌తో వందల జనన సర్టిఫికేట్‌లు • తర్వాత ఓటర్ ID, పాస్‌పోర్ట్ లను తయారు చేశారు .. వీటిని కూడా  REVERIFY చేస్తున్నారు.. ఢిల్లీ (MCD పరిధి)….మున్సిపల్ అధికారుల సహకారంతో ఫేక్ బర్త్ సర్టిఫికేట్ రాకెట్లు ఏర్పడ్డాయి.విదేశీయులను ఇండియాలో పుట్టినట్టు నమోదు చేశారు. అన్నిటిని క్యాన్సిల్  చేసేసారు

ఉత్తరప్రదేశ్…పంచాయతీ స్థాయిలో రిజిస్టర్ల మార్పులు.అసలు పుట్టని పిల్లల పేర్లతో జననాల నమోదు చేశారు. మొత్తాన్నిక్యాన్సిల్ చేశారు. రాజస్థాన్…ముందుగా ఫేక్ ఆధార్, ఆపై జనన సర్టిఫికేట్…ప్రభుత్వం జోక్యం చేసుకుని అనేక సర్టిఫికేట్‌లు రద్దు చేసింది.

ఆంధ్రప్రదేశ్…. ఇటీవల సత్య సాయి జిల్లాలో ఫేక్ జనన సర్టిఫికేట్‌లపై వార్తలు వచ్చాయి. గ్రామస్థాయి వ్యవస్థ దుర్వినియోగంపై అనుమానాలు కలిగాయి…  ప్రయత్నాలన్నీఎందుకు అత్యంత ప్రమాదకరం అంటే … ఇది కేవలం పత్రాల స్కామ్ కాదు… ఓటర్ల జాబితాలపై దాడి… డెమోగ్రఫీ మానిప్యులేషన్..  జాతీయ భద్రతకు ముప్పు…. భవిష్యత్ తరాల హక్కులపై కుట్ర… ఈ రోజు ఫేక్ జనన సర్టిఫికేట్…రేపు ఫేక్ ఓటర్… మరుసటి రోజు పాలనపై ప్రభావం.

అందుకే కఠిన దర్యాప్తు, డిజిటల్ వెరిఫికేషన్, SIR / NRC వంటి శుద్ధి ప్రక్రియలు అవసరం…  లేకపోతే రేపు “ఎవరు పౌరులు? ఎవరు కాదో?” అనే ప్రశ్నకే జవాబు ఉండదు.చాలా మంది అనుకుంటారు ఓటర్ IDని ఆధార్ కు లింక్ చేస్తే అయిపోతుందిగా , SIR లాంటివి అవసరమా అని. 

SIR కేవలము ఓటర్ లిస్ట్ ప్రక్షాళన కాదు , ఈ నకిలీ ఆధార్ లు , ఈ నకిలీ జనన పత్రాలు బయటకు తెచ్చే ప్రక్రియ . కలుగులో ఎలుకలు అన్ని బయటకు కొట్టుకు వస్తున్నాయి .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!