ఎవరీ నవ్య హరిదాస్? ఏమిటి ఆమె కథ ?

Sharing is Caring...

Active worker…… 

నవ్య హరిదాస్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పై పోటీ చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ప్రియాంక  విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు కెళ్ళి మరో సారి వార్తల్లో నిలిచారు. నవ్య కేరళ రాజకీయ నాయకురాలు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు.. 

కోజికోడ్ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా రెండు మార్లు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె కారపరంబ (Karaparamba) వార్డు నుండి కౌన్సిలర్‌గా ఎన్నికై హ్యాట్రిక్ విజయాన్నిసాధించారు.

నవ్య 2024లో జరిగిన వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వార్తల్లో నిలిచారు.ఇక్కడ ఆమె కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై పోటీ చేశారు.నాటి ఎన్నికలో నవ్య హరిదాసు కి 1,09,939 ఓట్లు వచ్చాయి. ప్రియాంక 4,10,931 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయాన్ని సవాలు చేస్తూ నవ్య హరిదాస్ 2024 డిసెంబర్ 20న పిటిషన్ దాఖలు చేశారు.ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాల్లో తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని… తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, కాబట్టి ఆమె ఎన్నికను రద్దు చేయాలని నవ్య కోరారు.

కేరళ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కోర్టు ప్రియాంక గాంధీకి సమన్లు జారీ చేసింది..  ఈ ఆరోపణలపై ఆమె వివరణ కోరింది.ఈ కేసు ఇంకా  విచారణ దశలోనే ఉంది. ప్రియాంక తనకు రూ.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని..వాటిలో రూ.4.24 కోట్లు విలువైన చరాస్తులు, రూ. 7.74 కోట్లు విలువైన స్థిరాసులు అని నామినేషన్ పత్రాలతో అందించిన ఆస్తి వివరాలలో ప్రస్తావించారు.అవి సరైన వివరాలు కావనేది నవ్య హరిదాస్ ఆరోపణ.   

ఇక రాజకీయాల్లోకి రాకముందు నవ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.ఆమె కాలికట్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న KMCT ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో B.Tech పట్టా పొందారు.కేరళలో జరిగిన వివిధ ఎన్నికలలో, ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలలో, వయనాడ్ ఉప ఎన్నికలో, ఆమె బీజేపీ తరపున కీలక ప్రచారకర్తగా, ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించే విషయంలో, చురుకైన పాత్ర పోషించారు.

ఇదంతా గమనించి ఆమెను ముందు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా , తర్వాత అధక్షురాలిగా పార్టీ నియమించింది.బీజేపీ కుటుంబ రాజకీయాలకు (family politics) వ్యతిరేకం.. సొంత ప్రతిభతో ఎదిగిన నాయకులను ప్రోత్సహిస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి నవ్య హరిదాస్ వంటి నాయకులను ఉదాహరణగా చూపిస్తుంది. నవ్య హరిదాస్ శోబిన్ శ్యామ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన సింగపూర్‌లో మెరైన్ ఇంజనీర్ గా చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!