‘అఖండ 2’ ను అడ్డుకున్నదెవరు ?

Sharing is Caring...

Postponed release…. 

“అఖండ 2” చిత్రం వాయిదా పడటానికి ప్రధానంగా న్యాయపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు కారణమయ్యాయి.ఈ విషయంలో బాధ్యులైన వ్యక్తుల నిర్లక్ష్య ధోరణిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రొడక్షన్ హౌస్‌తో ఉన్న పాత ఆర్థిక వివాదం కారణంగా, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని ఫలితంగా, బకాయిలు (దాదాపు ₹28 కోట్లు) చెల్లించే వరకు సినిమాను థియేటర్లలో లేదా డిజిటల్/శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయకుండా కోర్టు స్టే విధించింది.

నిర్మాతలు వివిధ ఫైనాన్షియర్ల నుండి తీసుకున్నపెద్ద మొత్తంలో డబ్బుకు సంబంధించిన క్లియరెన్స్‌లు లభించకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.అధికారిక ప్రకటనలలో, ముందుగా షెడ్యూల్ చేసిన ప్రీమియర్ షోలను రద్దు చేయడానికి “సాంకేతిక సమస్యలు” కారణమని మేకర్స్ చెప్పుకొచ్చారు.

అయితే ఇవి పైన ప్రస్తావించిన ఆర్థిక, న్యాయపరమైన చిక్కులతో ముడిపడి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఈ సమస్యల కారణంగా ఇవాళ (డిసెంబర్ 5, 2025 ) విడుదల కావాల్సిన ఈ సినిమా నిరవధికంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

అభిమానులు ఏమంటున్నారంటే ?

65 Years Age లో కుడా మా హీరో బాలకృష్ణ ఎంతో కష్టపడుతున్నాడు.. అఘోరా లాంటి క్యారెక్టర్ కి makeup వేయటానికి 2 hours, మళ్లీ తీయడానికి 2 hours పట్టేది. అయినా ఓపికతో అన్ని భరిస్తూ అదే getup తో గజగజ వణికించే హిమాలయాల లో కుడా షూటింగ్ పూర్తి చేశారు. 

ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే చెన్నై లో తుపాను ప్రభావం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ప్రమోషన్ వర్క్  చేసి వెళ్లారు. ఫ్లయిట్ ఆలస్యం అయినప్పటికీ .. మీడియా పర్సన్స్ వెయిట్ చేస్తున్నారు అని తెలిసి ఏమి తినకుండా, బ్రేక్ తీసుకోకుండా వెంటనే వచ్చి మాట్లాడి వెళ్లారు.

ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ కి మొదటి రోజు ఇంత రావాలి, యు ఎస్ లో ఇంత రావాలి, యూట్యూబ్ వ్యూస్ రావాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయండి అని ఎవర్ని అడగలేదు, ఎవరికి కండిషన్ పెట్టలేదు. హీరో ఇంత కోపరేట్ చేస్తే .. నిర్మాతలు సినిమా రిలీజ్ విషయం లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా.

థియేటర్స్ దగ్గర అభిమానులు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు.. థియేటర్స్ ని గుడి లాగా అలకరించారు,ఎంతో ఖర్చు చేశారు.. వాళ్లకి సినిమా పోస్టుపోన్ అవుతుంది అని కూడా తెలియదు..కొన్ని నిముషాల్లో సినిమా రిలీజ్ అవుతుంది.. స్క్రీన్ మీద మా హీరో బాలయ్యను చూడబోతున్నాము అనే సంతోషంలో ఉన్నారు..అంతలోనే పిడుగు లాంటి వార్త..

టైం కి సినిమా రిలీజ్ అయి ప్లాప్  అయినా ఇంత బాధ ఉండదు.., పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడం మా ఫాన్స్ ని బాగా నిరాశ పరిచింది. హర్డిల్స్ ఏమి ఉంటాయో ఆలోచించకుండా .. ఎలా solve చేసుకువాలి అని ముందుగా ప్లాన్ చేసుకోకపోవడం బాధాకరం అని ఫాన్స్ అంటున్నారు. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!