ఎవరీ రుక్మిణీ వసంత్ ?

Sharing is Caring...

New Heroin ………….

రుక్మిణి వసంత్…  ‘కాంతారా చాప్టర్ వన్’  విజయం సాధించడంతో రుక్మిణీ వసంత్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.. కన్నడ తో పాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ ‘కనకావతి’ పాత్ర పోషించిన రుక్మిణి వసంత్ గురించే చెప్పుకుంటున్నారు.ఈ కన్నడ భామ రుక్మిణి వసంత్ గురించి ఆరా తీస్తున్నారు. ఆమె వివరాల కోసం అంతర్జాలంలో వెతుకుతున్నారు.

రుక్మిణి వసంత్ తండ్రి మిలిటరీ లో పని చేశారు. కల్నల్ వసంత్ వేణుగోపాల్ కర్నాటకకు చెందిన మొదటి అశోక చక్ర గ్రహీత. 2007లో కాశ్మీర్ లో ఉగ్రవాదుల్ని అడ్డుకునే క్రమం లో వేణుగోపాల్ అమరులయ్యారు.

ఆమె తల్లి సుభాషిణి వసంత్ భరతనాట్య నర్తకి, సామాజిక కార్యకర్త. యుద్ధ వితంతువులకు సహాయం చేసేందుకు “వసంత రత్న” ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ ను  ఏర్పాటు చేసి, అమర జవాన్ల పిల్లలకి స్కాలర్ షిప్స్ అందించడం,వారి భార్యలు తమ కాళ్ళమీద తాము నిలబడటానికి తగిన సాయం చేయడం చేస్తున్నారు.అలాగే నాట్యం లో శిక్షణ కూడా ఇస్తుంటారు. 
 
ఇక రుక్మిణీ బెంగళూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచే  కళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె బెంగళూరులోని ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్, సెంటర్ ఫర్ లెర్నింగ్ వంటి పాఠశాలల్లో చదువుకుంది. లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ (RADA)లో ఇంటెన్సివ్ యాక్టింగ్ కోర్సును అభ్యసించి, 2015లో పట్టభద్రురాలైంది.

రుక్మిణీ 2019 కన్నడ చిత్రం ‘బీర్బల్‌’లో ప్రధాన పాత్రతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 2023లో వచ్చిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ – ‘సైడ్ ఎ,  సైడ్ బి’ అనే రొమాంటిక్ డ్రామా చిత్రాలలో నటించారు. ఆమె కన్నడలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. బాణాదరియల్లి,బఘీరా,  భైరతి రణాలు వంటి సినిమాల్లో నటించారు.

 ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం ద్వారా రుక్మిణీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. తాజాగా  ‘కాంతారా  చాప్టర్ 1’లో కీలక పాత్ర పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన రాబోయే పాన్-ఇండియన్ చిత్రం ‘డ్రాగన్’ లో హీరోయిన్ గా  నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.

కేజీఎఫ్ హీరో యశ్ క్రేజీ ప్రాజెక్ట్ లోనూ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా చేయబోతున్నారు.ఈ సినిమాల తరువాత రుక్మిణి మరింత బిజీ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. కాంతారా చాప్టర్ విజయవంతం అయ్యాక రుక్మిణీ కి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. రుక్మిణి ఇంస్టాగ్రామ్, ఫేస్బు క్ లో యాక్టీవ్ గా ఉంటారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!