Ice Caves……………………………..
‘కట్లా ఐస్ కేవ్’ ఐస్లాండ్ దేశం లో ఏడాది పొడవునా కనిపించే ఏకైక మంచు గుహ.గుహ లోపలి భాగం నీలం, నలుపు రంగులో ఉంటుంది.ఈ మంచు గుహ ‘విక్’ అనే చిన్న పట్టణం నుండి 1 గంట ప్రయాణ దూరంలో ఉంది.ఐస్లాండ్‌లో ఈ మంచు గుహ ఇపుడు ప్రముఖ పర్యాటక ఆకర్షణ గా మారింది.
హిమానీనదం కింద నీరు గడ్డకట్టినప్పుడు సహజ మంచు గుహలు ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం కొత్త మంచు గుహలు ఏర్పడుతుంటాయి. ఈ మంచు గుహ లోపలికి వెళ్ళిన తర్వాత, మంచు ను వివిధ రంగుల్లో చూడవచ్చు..కట్లా మంచు గుహ ఖచ్చితమైన వెడల్పు,ఎత్తు స్థిరంగా ఉండవు.
నిరంతరం మారుతున్నస్వభావం కారణంగా స్థిరంగా లేవు. సుమారుగా 100 మీటర్లు (328 అడుగులు) కంటే ఎక్కువ లోతుగా ఉందని అంటారు. చూస్తే “లోతైన నీలిరంగు మంచు సముద్రం”లా అనిపిస్తుంది. హిమానీనదం కింద కోట్లుజోకుల్ అనే అగ్నిపర్వతం ఉంది. మంచు గుహ కు ఆ పేరునే పెట్టారు.
ఈ మంచు గుహ హిమానీనదం భూగర్భంలో ఉంది.. శిక్షణ పొందిన హిమానీనద గైడ్ పర్యాటకులకు దగ్గరుండి అన్ని చూపిస్తారు.సహజ మంచు గుహలను చలికాలంలో మాత్రమే చూడగలం. కానీ కట్లా మంచు గుహ ఏడాది పొడవునా సందర్శించదగిన ప్రదేశం. సంవత్సరంలో ఏ నెలలోనైనా సందర్శించగల కొన్ని మంచు గుహలలో ఇది ఒకటి.
కట్లా ఒకప్పుడు క్రియాశీల అగ్నిపర్వతం.. నిరంతరం ఇది నిపుణుల పరిశీలనలో ఉంటుంది. ఈ క్రమంలో మంచు గుహ పర్యటనలలో విస్ఫోటనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కట్లా కదిలితే, హెచ్చరికలు ఉంటాయి.. పర్యటనలు ముందుగానే నిలిపివేయబడతాయి. కట్లా చివరిసారిగా 1918లో విస్ఫోటనం చెందింది. క్రీ.శ. 920 నుండి కేవలం 20 విస్ఫోటనాలు మాత్రమే నమోదు అయ్యాయి. వేసవి కాలంలో ఎక్కువమంది మంచు గుహను చూసేందుకు వస్తుంటారు .
అగ్నిపర్వతాలపై హిమానీనదాలు ఎలా ఏర్పడతాయి ?
అగ్నిపర్వతం తాలూకు బిలం లేదా గుంటలలో మంచు పూర్తిగా కరగకుండా పేరుకుపోతుంది, ఇది సంవత్సరాలుగా పేరుకుపోయి గట్టిపడుతుంది.ఇతర హిమానీనదాల మాదిరిగానే, అగ్నిపర్వత హిమానీనదం కుదించబడి దట్టమైన మంచుగా ఏర్పడటానికి తగినంత హిమపాతం అవసరం.హిమపాతం ఎక్కువగా పడేచోట ఇవి ఏర్పడతాయి.
‘మౌంట్ సెయింట్ హెలెన్స్’USA లో 1980 విస్ఫోటనం ద్వారా ఏర్పడిన బిలం కొత్త హిమానీనదం ఏర్పడటానికి సరైన వాతావరణాన్ని సృష్టించింది. ఐస్లాండ్లో హిమానీనదాలు కప్పబడిన అగ్నిపర్వతాలు ఉన్నాయి.ఈ పరిణామం హిమానీనదాలు,అగ్నిపర్వతాలు కలిసి జీవించగలవని నిరూపిస్తుంది.
అలాగే అంటార్కిటికా లో మంచు పలకల క్రింద అగ్నిపర్వతాలున్నాయంటారు. ఒకవేళ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగితే మంచు కప్పు వేగంగా కరిగిపోతుంది.అలా జరిగితే భారీ వరదలు లేదా బురద ప్రవాహాలు ఏర్పడతాయి. ఇవి దిగువన జనాభా ఉన్న ప్రాంతాలకు నష్టం చేకూరుస్తాయి.