కేదార గుహల్లో ధ్యానం … ఓ కొత్త అనుభూతినిస్తుందా?

Sharing is Caring...

Meditation gives a new feeling ……………………………

మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది.

ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో ధాన్యం చేసే  ప్రక్రియ పాపులర్ అవుతోంది. ఆమధ్య ప్రధాని మోడీ ధ్యానం చేసిన రుద్ర గుహ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది.

ఈ ధ్యానం పట్ల పర్యాటకులలో ఆసక్తి పెరిగింది. భక్తుల ఎంక్వయిరీలు ఎక్కువైనాయి.  దీంతో  భక్తుల కోసం మరిన్ని గుహల నిర్మాణానికి  ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూనుకుంది. కొత్తగా మూడు గుహలను నిర్మించింది. కేదార్‌నాథ్ సందర్శకులు కొంత సమయం ఒంటరిగా, ప్రశాంతంగా గడపడానికి, ధ్యానం చేసుకోవడానికి ఈ గుహలు ఉపయోగపడతాయి.

ఈ గుహలు కేదార్‌నాథ్ ఆలయం ఎడమ వైపు పర్వతం దగ్గర .. కిలోమీటరు దూరంలో ఉన్నాయి. ఈ గుహల్లో అటాచ్డ్ టాయిలెట్, సౌర విద్యుత్, తాగునీరు ఉంటాయి.రుద్ర గుహలు 2019 మే 18 న ప్రధాని మోడీ అక్కడ ధ్యానం చేసినపుడు వెలుగులోకి వచ్చింది.

మూడు కొత్త గుహలు రుద్ర గుహ సమీపంలోనే ఉన్నాయి .కేదార్‌నాథ్‌లో లాడ్జీలు, క్యాంటీన్‌లను నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ పర్యాటక విభాగం ఘర్ వాల్ మండల్ వికాస్ నిగం కొత్త గుహల బుకింగ్ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. 

నెహ్రు మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్మించిన ఈ ధ్యాన గుహల్లో మూడురోజులు వరకు ఉండొచ్చు. పరిమిత సంఖ్యలో గుహలు ఉన్నందున ముందస్తు గా బుక్ చేసుకోవాలి. ఈ గుహలను ఒక రాత్రికి బుకింగ్ చేసుకోవాలంటే రూ..1500 ఉదయం 6 am నుంచి సాయంకాలం 6 pm  వరకు అయితే రూ. 999 చెల్లించాలి.

ఉదయం టీ. టిఫిన్, మధ్యాహ్న భోజనం సాయంత్రం టీ, రాత్రి భోజనం అందిస్తారు. అక్కడ ఒక బెల్ కూడా ఉంటుంది.బెల్ మోగిస్తే సహాయకులు వస్తారు. ఈ గుహల్లోకి ధ్యానం కోసం ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు.కేదార్ నాథ్ ఆలయం మూసివేసినపుడు గుహలను కూడా మూసి వేస్తారు.  

ఈ గుహలు  సహజసిద్దంగా ఏర్పడినవి కావు.ఇవి మానవ నిర్మితంగా రూపొందినవే. సాధారణంగా కేదారనాథ్ దర్శించే భక్తుల్లో చాలా మంది అక్కడే ఓ రాత్రి బసచేసి, పూజలోకానీ, ధ్యానంలో గానీ ఉండాలని కోరుకుంటారు…కానీ చలిప్రదేశం, గుడి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ ధ్యానం సరికాదు..పైగా భద్రతా సమస్యలు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వీటిని నిర్మించారు. వీటికి ఇపుడిపుడే ఆదరణ పెరుగుతోంది. 

బుకింగ్ చేసుకునే భక్తులు ఆరోగ్య పరంగా ఫిట్ నెస్ కలిగి ఉండాలి. కేదార్ నాథ్ లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ఒకే అయితేనే గుహలో ధ్యానం చేయటానికి అనుమతిస్తారు.

GMVN హెల్ప్ లైన్ NO
0135- 2746817, 2749308
+91 9568006639
info@gmvnl.in

——————–  KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!