ఈ ‘నర గణపతి’ ఆలయం గురించి విన్నారా ?

Sharing is Caring...

Ancient temple ……………………….

తమిళనాడులో “తిలతర్పణపురి” అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్’ ఆలయాన్ని దర్శిస్తే పితృదోషాన్ని పోగొట్టుకోవచ్చు అంటారు.ఈ ఆలయం ‘కుంభకోణం’ కు 39 కి.మీ దూరంలో ఉంది. భక్తులు ఇక్కడకు వచ్చి తర్పణాలు వదులుతుంటారు.

ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించారని పురాణ కథలు చెబుతున్నాయి. తన తండ్రికి ఎన్నోచోట్ల పిండప్రధానం చేసినప్పటికీ ముక్తి లభించకపోవడంతో… రాముడు.. శివుడిని ప్రార్ధించాడు. అపుడు శివుడు ప్రత్యక్షమై..ఆ ఊరిలో ఉన్న కొలనులో స్నానం చేసి.. దశరథుడికి పితృతర్పణం వదిలి పెట్టమని చెప్పారని అంటారు.

అప్పటి నుంచి ఆ ఊరిని ‘తిలతర్పణపురి’ అని పిలుస్తున్నారట. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు ‘తిలతర్పణపురి’గా ప్రసిద్ధి గాంచింది.

ఎవరైతే పెద్దలకు పితృతర్పణం నిర్వహించలేక బాధలు, ఇబ్బందులు పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణలు వదిలితే దోషం నుంచి విముక్తి లభిస్తుంది అంటారు.

సుమారు 1400 ఏళ్ళ క్రితంనాటి ఈ ఆలయం పితృదోష నివారణ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ప్రతినెలా అమావాస్య నాడు, మహాలయ పక్షాల్లోనే కాదు… సాధారణ దినాల్లో సైతం ఎంతోమంది ఈ ఆలయం సమీపంలో ఉన్న ‘చంద్రతీర్థం’ అనే కొలనులో స్నానం చేసి, పిండప్రదానాలు చేసి, తర్పణాలు వదిలి… శివపార్వతులను, గణపతిని దర్శించుకుంటారు.

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఇక్కడ గణపతి నరముఖంతో దర్శనమిస్తారు. గణపతి తొండం లేకుండా మనిషి ముఖంతో ఉంటారు.ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి ఆలయంగా ప్రసిద్ధిపొందింది.

వాస్తవానికి ఈ ఆలయంలో ప్రధాన దైవం ముక్తీశ్వరుడు. కానీ ‘నర గణపతి ఆలయం’గానే ప్రసిద్ధి గాంచింది.ముక్తీశ్వరుడు, ఆయన దేవేరి స్వర్ణవల్లి, నర గణపతితోపాటు ఈ ఆలయంలో సూర్య, చంద్రుల విగ్రహాలు కూడా పూజలు అందుకుంటున్నాయి.

తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు సరస్వతీ ఆలయం కు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!