Telangana Tourism సంస్థ ‘పాపికొండలు టూర్ ‘ ని ప్రారంభించింది. ఆమధ్య వర్షాల కారణంగా నిలిచిపోయిన ‘పాపికొండలు టూర్ ని తాజాగా మళ్లీ మొదలుపెట్టింది. ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం అరుదైన అనుభవంగా నిలిచిపోతుంది.
ఎంతో అద్భుతంగా సాగే ప్రయాణం మర్చిపోలేని అనుభూతులను అందిస్తుంది. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. తెలంగాణ టూరిజం ఆఫర్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ పేరు ‘పాపికొండలు రోడ్ కమ్ రివర్ క్రూయిజ్’.
3 రోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. భద్రాచలం వరకు బస్ లో టూర్ సాగుతుంది. ప్రతి శుక్రవారం టూర్ ఉంటుంది. ప్రయాణం ఇలా సాగుతుంది..
@ Day 1… రాత్రి 7.30 గంటలకు ఐఆర్‌ఓ ప్రయాణిక్ భవన్ నుంచి బస్ బయలుదేరుతుంది. 8 గంటలకు బషీర్‌బాగ్లోని సీఆర్‌ఓ ఆఫీస్ నుంచి మరికొంతమంది ప్రయాణీకులను ఎక్కించుకుని భద్రాచలంకు బస్ బయలుదేరుతుంది.
@ Day 2…. ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఫ్రెష్ అయ్యాక 8గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటు ప్రయాణం మొదలవుతుంది. పాపికొండలు,పేరంటాలపల్లి ని సందర్శించి కొల్లూరు, కొర్టూరు వెళతారు. బోటులోనే అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. రాత్రి హరిత హోటల్ లో బస.. ఒక రూమ్ లో ఇద్దరు ఉండొచ్చు.
@ Day 3…ఉదయం భద్రాచలం శ్రీరాముల వారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత పర్ణశాలకు వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం భోజనం సమయానికి హరిత హోటల్‌కు చేరుకొని భోజనం చేస్తారు. భోజనం చేసిన తరువాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 10గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి..
పెద్దలకు రూ. 6999 , చిన్నారులకు రూ. 5599 ఫిక్స్ చేశారు. టూర్ ప్యాకేజీలో నాన్ ఏసీ బస్సు, హోటల్‌లో నాన్ ఏసీగదులు, బోటింగ్, బోట్‌లో ఫుడ్ కవర్ అవుతాయి. ఇతర ఖర్చులన్నీ ప్రయాణికులే భరించాలి. పూర్తి వివరాలు , బుకింగ్స్ కోసం 9848540371, 9848125720.. నంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చు.