చిన్నసినిమాలంటే అంత చిన్నచూపా ?

Sharing is Caring...

Priyadarshini Krishna …………………….  Plight of small producers

ఒక పదేళ్ళ క్రితం తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్ లు గట్రా ఇప్పటిలా అంత ఉదృతంగా ఉండేవి కావు. సక్సెస్ ఈవెంట్లు మాత్రం బ్రహ్మాండంగా చేసేవారు…
ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది కేవలం మూడురోజుల ముచ్చట అయినందున ఈ జైత్రయాత్రలు, సక్సెస్ మీట్లు తగ్గి పోయి వాటి స్థానంలో సినిమా రిలీజు కి ముందే అన్ని పండగలు, పబ్బాలు మొదలెట్టారు మేకర్స్.

ఆ క్రమంలో పుట్టుకు వచ్చినవే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్స్, టీసర్, ట్రైలర్, పోస్టర్, హీరోలుక్ రివీల్, లిరికల్ సాంగ్ రిలీజ్ అని నానా సోది ప్రాగ్రామ్స్ కు రూపకల్పన చేస్తుంటారు. ఈ డిజిటల్ యుగంలో అందునా విచ్చలవిడిగా దొరికే యూట్యూబ్ ఇన్‌స్టాగ్రాం ల రెవెన్యూ ని ఆధారం చేసుకుని ఆ డబ్బుని కూడా కొల్లగొట్టాలనే ప్రయత్నంలో వాటిపైన కూడా ఫోకస్ పెట్టాయి ప్రొడక్షన్ హౌస్ లు.

అసలు సినిమా సంగతి దాని మేకింగ్ సంగతి గాలికొదిలేసి ప్రచార ఆర్భాటం పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. చిన్నా లేదు … చితకా లేదు … పెద్ద లేదు. అందరూ అదే బాట. పెద్ద సినిమాలకు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఉండవు. డబ్బులు గుమ్మరిస్తారు కాబట్టి అన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఎటొచ్చి చిన్న సినిమాలకే అన్ని బాధలు.

కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త హీరో అయితే ఇంక ఆ కష్టాలు చెప్పనలవి కాదు….రీసెంట్ గా రిలీజైన ‘జితేందర్ రెడ్డి’ అనే చిత్రరాజానికీ అవే ఇబ్బందులు. అది ఒక బయోపిక్. ఎన్నో ఈతిబాధలు, పురిటి కష్టాలను నెట్టుకుని సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.అయినా కష్టాలు ఆగలేదు.

రిలీజ్ కి కష్టాలు, థియేటర్స్ దొరకడానికి ఇబ్బందులు. అవే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ఆడియన్సే కాదు అసలు గెస్ట్ లు గా కూడా ఎవరిని పిలిచినా వస్తాము అనే భరోసానే ఇవ్వలేదంట. ఫార్మ్ లో ఉన్న హీరోలు సెలబ్రిటీ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు, ఎప్పుడో పాతికేళ్ళక్రితం సినిమా తీసిన ఒకానొక దర్శకుడు కూడా వస్తా అని చెప్పి డుమ్మా కొట్టాడంట. 

చిన్న సినిమాలకి అన్నీ కష్టాలే….ఐనా నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ ప్రీరిలీస్ ఈవెంట్లు చేసుడెందుకు, ఎవడూ దేకట్లేదని ఏడ్చుడెందుకు….ఎంచక్కా మునుపటి లాగా హాయిగా కామ్‌గా రిలీస్ చేసుకోవచ్చు కదా…ఆ ప్రీరిలీస్ ఈవెంట్లకు పెట్టే ఖర్చేదో డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చెయ్యొచ్చు కదా… కనీసం నాలుగైదు యూట్యూబ్ ఛానెల్స్ లోన ఐనా ప్రేక్షకులకు కనపడతారు.

ఈ ఈవెంట్ల వల్ల చేతి చమురు, ఈవెంట్ సంస్థలను పోషించుడే కానీ ఉపయోగం ఏమీ ఉండదనే విషయం వీరికి అర్థమైతేకదా….అంత అర్థమైయ్యేదుంటే ఆ సినిమానే అద్భుతంగా తీస్తారు కదా అంటారా…?!
ఏమో లెండి..

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!