Experiments of Chinese intellectuals……………………
చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు.
మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం కేవలం కలలు .. కల్పిత కథలు, నవలల్లో మాత్రమే సాధ్యం. ఈ విషయం లో చైనా వాళ్లు ఒకడుగు ముందుకేసి A i పరిజ్ఙానం సహాయంతో మరణించిన వారి రూపంతో డిజిటల్ అవతార్ లను తయారు చేస్తున్నారు.చనిపోయిన వారు జీవించి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు.. వీడియోలను ఉపయోగించి ఈ అవతార్ లకు రూపకల్పన చేస్తున్నారు.
వీటికి చాట్‌బాట్ లు అనే పేరుపెట్టారు.ఈ చాట్ బాట్ ద్వారా దగ్గరి బంధువులు డిజిటల్ అవతార్ తో మాట్లాడవచ్చు. బంధువులు మాట్లాడుతుంటే అవతార్ చనిపోయిన వారి గొంతు తోనే జవాబులు ఇస్తారు. చనిపోయిన వారి గొంతును క్లోన్ చేసి వాయిస్-జెనరేటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా AI టెక్నాలజీ వినియోగించి డిజిటల్ అవతార్ మాట్లాడేలా చేస్తున్నారు.
ఈ అవతార్ లు అచ్చం చనిపోయిన మనిషిలానే మాట్లాడుతున్నాయి. దీంతో వీటికి చైనాలో ఆదరణ పెరుగుతోంది. త్వరలో ఈ చాట్ బాట్ తయారీ ప్రక్రియ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంది. … .. ఇదే సమయంలో ఈప్రక్రియపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒక మనిషి మరణించిన తర్వాత కొన్ని రోజులకు సహజంగా వారిని మర్చిపోతాం. ఆ సహజ ప్రక్రియకు ఈ చాట్ బాట్ లు ఆటంకంగా మారుతున్నాయి.
మరణించిన మనిషిని మర్చిపోకుండా చేస్తున్నాయని టెక్ నిపుణులు అంటున్నారు. ఇదేవిధంగా మరణించిన సెలబ్రిటీల అవతార్‌లను రూపొందిస్తున్న కంపెనీలు ..వారి పరువు ప్రతిష్టలకు, గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ చాట్ బాట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.. అదంతా జరిగేలోగా… వ్యాపార సంస్థలు ఈ ప్రక్రియ ను కమర్షియల్ గా మార్చేసి సొమ్ములు దండుకుంటాయనడంలో సందేహం లేదు..