ఆ’గ్లేసియర్ రైలు’ప్రయాణం ఓ అద్భుతం!!

Sharing is Caring...

A train that shows the beauty of nature up close…… 

స్విట్జర్లాండ్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి గాంచిన దేశం. ఆ అద్భుతాలను,ప్రకృతి అందాలను దగ్గరగా వీక్షించడానికి, ఆస్వాదించడానికి  గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాలి. ఈ రైలు ప్రయాణించే మార్గాలలో చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోతైన లోయలు, మెరిసే సరస్సులు కనువిందు చేస్తాయి. 

స్విట్జర్లాండ్‌లోని కొన్ని అందమైన ప్రకృతి దృశ్యాలను చూపిస్తూ ఈ ఐకానిక్ రైలు పర్యాటకులను తీసుకెళ్తుంది. ఈ రైలు చాలా నెమ్మదిగా వెళుతుంది. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే ఏకైక ట్రైన్‌ గా దీనికి  గుర్తింపు ఉంది. ఈ రైలు వేగం గంటకు 24 మైళ్లు మాత్రమే. ఎందుకు ఈ రైలు అంత నెమ్మదిగా వెళుతుంది అంటే అది వెళ్లే మార్గంలో  కొండల పై నిర్మించిన 291 వంతెనలు, 91 సొరంగాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా దాటుకుంటూ మెల్లగా అది ముందుకు సాగుతుంది.  

ఈ గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ జెర్మాట్ నుంచి సెయింట్ మోరిట్జ్ వరకు వెళుతుంది ..ఈ రైలు  ప్రయాణ సమయం 8 గంటలు. ఈ 8 గంటల ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ పర్యాటకులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఈ రైలు కొంత దూరం మంచుతో కప్పబడిన మార్గం గుండా, మరికొంత దూరం కొండల మధ్య గుండా, ఇంకొంత దూరం పచ్చని పొలాల మధ్యగా వెళుతుంది.

నదులను .. సరస్సులను, మంచు పడుతున్న దృశ్యాలను తిలకిస్తూ ప్రయాణించవచ్చు.ఇలా దారి పొడుగునా  విభిన్న సుందర దృశ్యాలు పర్యాటకుల మనసు దోచుకుంటాయి. ఈ రైలు ప్రయాణం ఖరీదైనది. వన్ వే చార్జీ 16 వేల వరకు ఉంటుంది.

కొన్ని ట్రావెల్ సంస్థలు వివిధ ప్యాకేజీలు తీసుకొచ్చాయి. ట్రావెల్ సంస్థల ద్వారా వెళితే కొంత తగ్గుతుంది. ప్యాకేజీలో హోటల్ బస ,భోజన సౌకర్యాలు కూడా ఉంటాయి.  ఈ రైలులో ఆహారం, పానీయాలతో సహా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. నెట్ లో ఇతర సమాచారం దొరుకుతుంది. 

pl .. watch video ………………  ‘గ్లేసియర్ రైలు’ప్రయాణం 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!