“అధినాయక జయహే!”అంటూ ఇంకెన్నాళ్లు పొగడాలో?

Sharing is Caring...

The government did not respond………………………….

మన జాతీయ గీతంపై విమర్శలు ఈనాటివి కావు. అయినా మన అధినాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. 74 ఏళ్ళనుంచి ఐదవ జార్జి చక్రవర్తి ని పొగుడుతూనే ఉన్నాం.ఇప్పటికైనా మార్చండి అంటే పట్టించుకునే నాధుడే లేడు.అప్పట్లో ఏదో హడావుడిగా ప్రకటించారు.

ఒకప్పుడు జార్జి చక్రవర్తిని పొంగుతూ ‘జనగణాలకు వారి మనస్సులకు అధినాయకుడివైన ఓ నాయకా, నీకు జయము కలుగు గాక. ప్రజలందరి మనసుకు అధినేతవు. భారత భాగ్యవిధాతవు అయిన నీకు జయమగుగాక. సకల జనులకు మంగళ కారకుడవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’ అని రవీంద్ర నాథ్ ఠాకూర్ గీత రచన చేసిన మాట వాస్తవం అంటారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి 1935 లో జనగణమన జాతీయగీతంగా ఉండాలని తీర్మానించింది. అప్పుడే ఈ తీర్మానంపై విమర్శలు మొదలయ్యాయి. అయినప్పటికీ  ‘జనగణమన’ను 1950 జనవరి 24న జాతీయ గీతంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

భారత రిపబ్లిక్‌ కు తొలి రాష్ట్ర పతిగా డా రాజేంద్రప్రసాద్‌ ఎన్నికైన రోజే జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతానికి జాతీయ గీతంతో సరిసమానమైన గౌరవం ఉంటుందని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఆ నాటి సభలో ప్రకటించారు. అయితే వందేమాతరమే జాతీయగీతంగా ఉండాలనే ప్రతిపాదన కూడా బలంగా వచ్చింది.

ముస్లింలు, కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు దానిని వ్యతిరేకించారు. జాతీయగీతంపై చర్చ జరగడం ఇష్టంలేని పాలకవర్గాలు ‘జనగణమన’ ను హడావిడిగానే జాతీయగీతంగా నిర్ణయించి ఆ వివాదం సద్దుమణిగేలా చేశారు. ఆ గీతమే నేటికీ కొనసాగుతోంది.దీన్ని మార్చాలని పలువురు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

ఆ మధ్య బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి  ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు.  జాతీయ గీతం ‘జనగనమణ’లో మనం పాడుతున్న ‘సింధు’ అనే ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్ లో ఉందని కాబట్టి దాన్ని మనం ప్రశంసించాల్సిన పనిలేదు.

దానిని తొలగించి ‘ఈశాన్యం’ అనే పదాన్ని చేర్చాలని 2019లో కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారని తన లేఖలో గుర్తుచేశారు. భవిష్యత్తులో ‘జనగనమణ’ గీతంలోని అనవసరపు పదాలను తొలగించి, అవసరమైన వాటిని చేర్చి జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అన్న విషయాన్ని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు.అప్పటినుంచి ఎంతమంది గుర్తు చేసినా మార్పులు చేర్పులు జరగడం లేదు. 

post updated on 17/3/2024

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!