కోట్లు ఆర్జిస్తున్న యూట్యూబర్ !!

Sharing is Caring...

Expert in creating new content………………………

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వేదికగా ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ . ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ గా ప్రసిద్ధి చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ ‘ యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి. జిమ్మీ ఛానల్ పేరు మిస్టర్ బీస్ట్. ఈ ఛానెల్ కు 139 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఆసక్తికరమైన కంటెంట్ సృష్టించడంలో ఆరితేరిన జిమ్మీ వీడియోలను రూపొందించడంలో ఖర్చుకు వెనుకాడడు. ప్రపంచం మునుపెన్నడూ చూడని కంటెంట్‌ని సృష్టించడం కోసం అతను ఎంత గానో శ్రమిస్తాడు. తనకు ఉన్న వనరులన్నింటినీ ఉపయోగిస్తాడు. ఈ క్రమంలోనే ఒక ట్రెండ్ సృష్టించాడు. ఆ ట్రెండ్ ను ఇతరులు ఫాలో కావడం చాలా కష్టం.

అతను ఏది సృష్టించినా దాన్నెవరూ కాపీ చేయలేని శ్రమ ఉంటుంది. జిమ్మీ డొనాల్డ్‌సన్ తన యూట్యూబ్ ఛానెల్‌ని గేమింగ్ వ్లాగ్‌గా ప్రారంభించాడు. ఇందులో స్టుపిడ్ ఛాలెంజ్‌లు ఉంటాయి. అవన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకుని వైరల్‌గా మారి మిలియన్ల కొద్దీ అనుచరులు అతన్ని ఫాలో అవుతున్నారు.

2017లో జిమ్మీ ‘MrBeast ఛాలెంజ్’ని ప్రారంభించాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలను ప్రభావితం చేయడానికి విరాళాలను అందించాడు. అతను ఇటీవల తన దుస్తుల కంపెనీ టీమ్ ట్రీస్‌ తరపున 50 భాగస్వామ్య సంస్థల సహాయంతో ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ చెట్లను నాటి రికార్డు సృష్టించాడు. ఎంతో మంది పేదలకు గుండె ఆపరేషన్లు చేయించాడు.

ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న యువకులలో జిమ్మీ కూడా ఒకరు కావడం విశేషం. 2021లో అతడు ఏకంగా 54 మిలియన్ డాలర్లను సంపాదించారు.ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.400 కోట్ల కంటే ఎక్కువ.

1998 మే 1న నార్త్ కరోలినాలోని గ్రీన్విల్లేలో జన్మించిన జిమ్మీ డొనాల్డ్సన్ 2012లో మిస్టర్ బీస్ట్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.యువతను ఎంతగానో ఆకట్టుకునే స్టంట్స్,గేమింగ్, కామెంటరీ మొదలైనవి ప్రారంభించి స్వల్ప కాలంలోనే ఎక్కువమందిని ఆకర్షించాడు.

ఇతని ఛానెల్ కోసం కొన్ని సంస్థలు బిలియన్ డాలర్లను ఆఫర్ చేసినప్పటికీ వాటన్నింటిని తిరస్కరించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికి కూడా అతడు సొంతంగానే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్స్ జాబితాలో డొనాల్డ్ సన్ 40వ స్థానం పొందాడు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!