తమిళనాట బీజేపీ ప్రముఖ నటి ఖుష్బూను తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించబోతోంది. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఖుష్బూ పార్టీ అధికార ప్రతినిధిగా చేసారు. గత ఏడాది ఎన్నికల్లో ఎంపీ సీటు అడిగితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా పట్టించుకోలేదు. దీంతో అప్పటినుంచి ఖుష్బూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. ఆపార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఖుష్బూ చేతిలో ప్రస్తుతం సినిమాలు ల్లేవు. ఒకప్పుడు తెలుగు, తమిళ ,కన్నడ ,మలయాళం చిత్రాల్లో నటించింది. పెద్ద హీరోల సరసన నటించింది.
ఈమె పుట్టింది ముంబయిలో.. తమిళనాడు కి చెందిన బిజినెస్ మాన్,నిర్మాత సుందర్ ను పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. తమిళ నాట ఖుష్బూకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆమె పేరిట గుడి కూడ కట్టారు.
తమిళనాడులో కనీసం కాలుమోపాలని చాలాకాలంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నటి ఖుష్బూ ను పార్టీలోకి చేర్చుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంఖ్యాబలం పెంచుకోవాలని బిజేపీ నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. కొద్దీ కాలం క్రితం సినీ తారలు గౌతమి , నమితలను కూడా పార్టీ లో చేర్చుకున్నారు. మరికొంతమంది కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు రజనీ కాంత్ కోసం కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే ఆయన అసలు రాజకీయాల్లోకి వద్దామా ? లేదా ? అనే డైలమాలో ఉన్నారు.