ఆర్మీ హెలికాప్టర్లే ఎందుకు క్రాష్ అవుతున్నాయి ?

Sharing is Caring...

Crash .. Crash………………………………..

ఫలానా చోట ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిందనో  .. శిక్షణ ఛాపర్ పేలి పోయిందనో ..తరచుగా మనం వార్తల్లో చూస్తుంటాం… వింటుంటాం. కారణాలు ఏమైనా ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అందులో ఆర్మీ కి చెందిన విమాన ప్రమాదాల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఒక సారి చరిత్రను పరిశీలించి చూస్తే … ఈ ప్రమాదాల సంఖ్య తక్కువేమి కాదు. ప్రభుత్వం అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది. 

దేశంలో ఎన్నో మిలిటరీ గ్రేడ్ ఛాపర్స్ … ఎయిర్‌క్రాఫ్ట్‌లు  అసాధారణ ప్రమాదాలకు గురైనాయి. వీటి గురించి పార్లమెంట్ లోను చర్చించారు. గత రెండేళ్లలో ఏడు IAF విమానాలు కూలిపోయాయని కేంద్ర ప్రభుత్వం ఆమధ్య పార్లమెంటుకు తెలియజేసింది.మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన మిరాజ్ 2000తో సహా గత రెండేళ్లలో వైమానిక దళానికి చెందిన మొత్తం ఏడు విమానాలు కూలిపోయాయని రక్షణ శాఖ సహాయ మంత్రి లోక్‌సభ కు తెలియజేసారు.

అంతకుముందు జూలై 2019లో, అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ 2014 నుండి 2019 వరకు ఉన్న డేటాను పార్లమెంటుకు  సమర్పించారు.ఆ లెక్కల ప్రకారం 2014-15 నుండి 2018-19 వరకు ఐదేళ్లలో ప్రతి ప్రత్యామ్నాయ సంవత్సరం 10 కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.  2014-15 నుండి జూలై 2019 వరకు రక్షణ విమాన ప్రమాదాల్లో మొత్తం 46 మంది సిబ్బంది కూడా మరణించారు.

సైనిక విమానాలు/చాపర్‌ల ప్రమాదాల జాబితా

@ అక్టోబర్ 21, 2021న మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో శిక్షణలో ఉన్న IAFకి చెందిన మిరాజ్ 2000 విమానం కూలిపోయింది.
@ ఆగస్టు 25, 2021న రాజస్థాన్‌లోని బార్మర్‌లో శిక్షణా మిషన్‌లో IAFకి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది.
@ మే 20, 2021న పంజాబ్‌లోని మోగా జిల్లాలో జరిగిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఒక IAF పైలట్ చనిపోయాడు.
@ మార్చి17, 2021న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో IAF గ్రూప్ కెప్టెన్ ఒకరు మరణించాడు.

@ మిగ్ 21 బైసన్ విమానం జనవరి 5, 2021న రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలింది.
@ ఫిబ్రవరి 2019 లో IAF ఏరోబాటిక్ టీమ్ సూర్య కిరణ్ రెండు విమానాలు ఒకదానికొకటి గాలిలో ఢీకొన్నకారణంగా కూలిపోయాయి.  ఈ ఘటనలోఒక పైలట్ మృతి చెందాడు. 
@ అంతకుముందు అక్టోబర్ 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో శిక్షణా కార్యక్రమంలో  ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కూలిపోయి ఏడుగురు మరణించారు.

@  డిసెంబర్ 2015లో ఢిల్లీ విమానాశ్రయం సమీపంలో పారామిలటరీ విమానం కూలిన ఘటనలో 10 మంది సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది కన్నుమూశారు. 

ఇంకో లెక్క ప్రకారం 1948 —  2021 మధ్య, అంటే గత 73 సంవత్సరాలలో, సైన్యానికి చెందిన 1751 విమానాలు,హెలికాప్టర్లు కూలిపోయాయి. దీని ప్రకారం ప్రతి ఏటా సగటున 24 విమానాలు క్రాష్ అవుతున్నాయి. మనం 1994 నుండి 2014 సంవత్సరం వరకు మాత్రమే చూస్తే ఈ కాలంలో 394 విమానాలు,హెలికాప్టర్లు కూలిపోయాయి.

అంటే  సగటున ఏటా 20 విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.వాస్తవానికి ఇది చాలా తీవ్రమైన విషయం. పైలట్ల కిచ్చే శిక్షణలో లోపముందా ? చాపర్స్ లేదా విమానాల్లో లోపముందా నిశిత పరిశీలన జరగాలి.ఘటనపై విచారణ జరిపి … వచ్చిన నివేదికలను పక్కన పడేస్తే లాభమేమిటి ?  

—-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!