The parrot spoke……………..
రామ చిలుక గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. పచ్చ రంగులో, ఎర్ర ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇష్టమైన పక్షి గురించి ఎవరైనా అడిగితే చాలామంది రామ చిలుక పేరు చెబుతుంటారు. రామ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఇవి మనుషులతో కలిసి ఉంటున్నాయి.
కొన్ని చిలుకలు మనుషుల భాష నేర్చుకోడానికి ఇదే కారణం. నిజానికి, చిలుకలు సొంతంగా మాట్లాడలేవు . వాటి ఎదురుగా మీరు ఎదైనా పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే కొన్ని రోజుల తర్వాత అవి కూడా అదే పదాన్ని చెబుతుంటాయి.అంటే మనం చెప్పే పదాన్ని అవి మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంటాయి. ఇలాంటి లక్షణం మరే పక్షిలోనూ కనిపించదు.
మనుషుల భాషను అనుకరించేంత ప్రత్యేకత రామ చిలుకల్లో ఏం ఉంది అనే సందేహం రావచ్చు. మనుషుల భాషను అనుకరించే ఈ పక్షుల స్వరపేటికలో ఉన్న లక్షణాల కారణంగానే అవి మనం చెప్పిన పదాలను పలుకుతుంటాయి. చిలుకల స్వరపేటికలో ఉన్న ప్రత్యేకత ఇదే..
చిలుకలు మాట్లాడటం వెనుక సైన్స్ ఉందని పరిశోధకులు అంటున్నారు. సైంటిస్టులు చిలుకల శరీర ఆకృతిని పరిశీలించినప్పుడు.. వారికి రామ చిలుకల గొంతులో సిరింక్స్ అనే అవయవం కనిపించింది. ఇది రామ చిలుకల శ్వాసనాళంలో ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. చిలుకలు మానవ భాష మాట్లాడటానికి ఈ అవయవం సహాయపడుతుంది.
సైంటిస్టులు గత 34 సంవత్సరాలుగా చిలుక మెదడుపై పరిశోధనలు చేస్తున్నారు. చిలుకల మెదడు బయటి వలయంలో ఉండే గుండ్లు ఏ భాషనైనా నేర్చుకోవడంలో సహాయపడతాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. ఈ గుండ్లు ప్రతి చిలుక మెదడు బయటి వలయంలో ఉంటాయి.
కానీ చిలుకల షెల్స్ ఇతర పక్షుల కంటే చాలా పెద్దవి. అందువల్లనే ఇతర పక్షుల కంటే ఈ చిలుకలు ఏ భాషనైనా వేగంగా నేర్చుకోగలవు. మనుషులు మాట్లాడిన పదాన్ని అర్థం చేసుకుని రిపీట్ చేయగలుగుతాయి.అది అసలు విషయం.