ఈ ‘డెడ్ సీ’ కథేమిటి ?

Sharing is Caring...

The story of dead sea …………………..

డెడ్ సీ…. పేరున్న సముద్రం నైరుతి ఆసియాలో ఇజ్రాయెల్- జోర్డాన్ దేశాల మధ్య ఉంది. దీని తూర్పు తీరం జోర్డాన్‌కు, పశ్చిమ తీరంలోని సగం ఇజ్రాయెల్‌కు చెందుతాయి.డెడ్ సీ అనేది అసలు సముద్రం కాదు. ఒక సరస్సు మాత్రమే.

దాదాపు రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం రిఫ్ట్ లోయ ..  మధ్యధరా సముద్రం మధ్య ఉన్న భూభాగం అంతా సరస్సుగా మారింది. అక్కడి భూమి క్రస్ట్‌లో టెక్టోనిక్ ప్లేట్‌లు వేరుపడటం వలన ఏర్పడిన పెద్ద లోయలో ఈ డెడ్ సీ ఏర్పడింది. సముద్రం నీళ్లు కూడా ఇందులోకి వచ్చి చేరాయి. అందువల్లనే దీన్ని సముద్రంగా పిలుస్తారు.

సాధారణ సముద్రపు నీటి కంటే దాదాపు 10 రెట్లు ఈ సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి. జోర్డాన్ నది నుండి నీరు ఈ సముద్రంలోకి ప్రవహిస్తుంది.ఇజ్రాయెల్,దాని పొరుగు దేశాలు ఈ సముద్ర జలాలను వ్యవసాయానికి మళ్ళించాయి.

భూమి అత్యంత లోతైన స్థాయిలో ఉన్నకారణంగా ఈ సముద్రం క్రమంగా క్షీణిస్తోంది. 1930 లో దీని ఉపరితల వైశాల్యం 1,050 కి.మీ ఉండగా ప్రస్తుతం ఉపరితల వైశాల్యం  605 కిమీ కి తగ్గిపోయింది. కాలక్రమేణా రెండు వేర్వేరు బేసిన్లుగా విడిపోయింది.

జోర్డాన్ నది దాని ఉపనదులపై తాగునీరు, నీటిపారుదల కోసం అప్‌స్ట్రీమ్ ఆనకట్టలు నిర్మించడం వలన డెడ్ సీలోకి ప్రవహించే మంచినీటి పరిమాణం బాగా తగ్గింది.స్థానిక కంపెనీలు మృత సముద్రం నీటిని బయటకు పంపి పొటాష్, బ్రోమిన్ వంటి విలువైన ఖనిజాలను వెలికితీసి ఎగుమతి చేస్తున్నాయి.

వెచ్చని ఉష్ణోగ్రతలు డెడ్ సీ ఉపరితలం నుండి బాష్పీభవన రేటును పెంచుతున్నాయి.ఈ కారణాలవల్ల డెడ్ సీ వైశాల్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు

చారిత్రక,మతపరమైన ప్రాముఖ్యత కారణంగా “డెడ్ సీ’ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం గా మారింది. సందర్శకులు ఇక్కడి నీటిలో స్నానాలు చేస్తుంటారు.బురద స్నానాలు ఇక్కడ ప్రత్యేకం.ఈ సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో హోటళ్లు .. రిసార్టులు .. రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. పర్యాటక స్థలంగా బాగా గుర్తింపు పొందింది.ఇక్కడ హెల్త్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి

ఈ డెడ్ సీ లో ఉప్పు ..ఖనిజాలు అధికంగా ఉండటం మూలానా  కొన్ని సమస్యలకు ఈ ప్రాంతం చికిత్సా కేంద్రం గా మారింది. మొటిమలు, సోరియాసిస్ ..సెల్యులైట్, అలాగే కండరాల నొప్పి, ఆర్థరైటిస్ .. ఇతర చర్మ సమస్యలున్నవారు చికిత్సకోసం ఇక్కడికి వస్తుంటారు. పలు రకాల చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.

వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.సమీప ప్రాంతంలో గుహలు, సహజ నీటి బుగ్గలు, కుమ్రాన్ గుహలు,మసాడా వంటి చారిత్రక ప్రదేశాలను చూడవచ్చు. జోర్డాన్ నుండి కారు, టాక్సీ, బస్సు లేదా గైడెడ్ టూర్ ద్వారా డెడ్ సీ చేరుకోవచ్చు.. టూరిజం సంస్థలు ఎన్నో ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి.

డెడ్ సీ.. క్రమేణా క్షీణించి పోతున్న నేపథ్యంలో ..ఈ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇక్కడ 2011,2016,2021 సం..లలో నగ్న ప్రదర్శనలు జరిగాయి. ప్రముఖ అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు . 300 మంది స్త్రీ, పురుష వాలంటీర్ల శరీరాలకు తెల్లని రంగు వేసి,ఈ సముద్రం వద్ద నగ్నంగా నిలబెట్టి ఫొటోలు తీశారు. వాటిని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లారు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!