Be Alert ….
పోస్ట్ ఆఫీస్ పథకాలలో మీరు ఎలాంటి స్కీం లో పెట్టుబడి పెట్టి ఉన్నా .. సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ .. వివరాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారు.సేవింగ్స్ స్కీమ్ ,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) వంటి ఇతర పోస్టాఫీసు పథకాలను చిన్న పొదుపు పథకాలు అంటారు. వీటిలో మీరు పెట్టుబడి పెట్టి ఉంటే తప్పనిసరిగా ఆధార్, పాన్ వివరాలు ఇవ్వండి.
ఒకవేళ మీరు నిర్ణీత సమయంలోపు ఆ పత్రాలు సమర్పించకపోతే మీ ఖాతా స్తంభించిపోయే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు వడ్డీ రాబడి వంటి ప్రయోజనాలను కూడా పొందలేరు. ఆధార్ నంబర్‌ను బ్యాంక్ లేదా పోస్టాఫీసు బ్రాంచ్‌కి సమర్పించడంలో విఫలమైతే మీ పొదుపుఖాతా స్తంభించిపోతుంది. ఈ చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా పనిచేస్తుంది.
అందువల్ల, ఆధార్ వివరాలను సమర్పించడంలో వైఫల్యం ఈ పథకాల ప్రయోజనాలను పరిమితం చేస్తుంది. సెప్టెంబరు 30 గడువులోగా మీరు ఆధార్ నంబర్‌ను అందించనంత వరకు బ్యాంక్ లేదా పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా చేసింది.
2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆరు నెలలలోపు ఆధార్ సమర్పించాలని సూచించింది. ఈ ఆరు నెలల వ్యవధి సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కాబట్టి, వెంటనే మీరు గడువు తేదీకి ముందు మీ ఆధార్ నంబర్‌ను సమర్పించాలి.మీ పొదుపు ఖాతా స్తంభించిపోతే వడ్డీ మీ ఖాతాకు జమ కాదు.
.
పెట్టుబడిదారు అదే ఖాతా వివరాలను ఉపయోగించి పథకం మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకోలేరు.
మరోవైపు, పాన్ నంబర్ కూడా చాలా కీలకమైన పత్రమే. అయితే పెట్టుబడిదారులకు దీనిని సమర్పించడానికి ఎక్కువ సమయం ఉంటుంది.
మీ ఖాతా బ్యాలెన్స్ రూ.50,000 మించిపోయినా.. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా పొదుపు ఖాతాలోని మొత్తం క్రెడిట్‌లు రూ. 1 లక్ష కంటే ఎక్కువగా ఉన్నా.. ఒక నెలలోపు ఖాతా నుంచి చేసిన అన్ని బదిలీలు లేదా ఉపసంహరణల మొత్తం రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే మీకు అప్పుడు మీరు రెండు నెలలలోపు పాన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.