యశోదాబెన్ వార్త .. ఎంత పని చేసిందంటే ?

Sharing is Caring...

Worked with honesty but transferred ……………………

విధినిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించినా ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వస్తాయి. గుజరాత్‌ దూరదర్శన్‌ ఉన్నతాధికారి అలా ముక్కుసూటిగా వ్యవహరించి బదిలీ అయ్యారు. ఆ బదిలీ కూడా అండమాన్ కే. నిజానికి పాపం ఆయనేమి తప్పు చేయలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోద బెన్ కు సంబంధించిన వార్త రాగానే ఆయన మామూలుగానే దాన్ని ప్రసారం చేశారు. అది రెండు నిమిషాల లోపు వార్తే. ఆయన తన డ్యూటీ అనుకున్నారు. ఆ తర్వాత అన్ని టీవీ చానళ్ళలో  ఆ వార్త జాతీయ స్థాయిలో ప్రసారమై … రచ్చ రచ్చ అయింది.

అంతే ఒక ఏడాదిలో రిటైర్ కానున్న అహ్మదాబాద్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ వనోల్ కి రెండు వారాల్లో బదిలీ ఆర్డర్ అందింది. ఆ ఆర్డర్ చూసి అతగాడు ఖంగు తిన్నాడు. పై అధికారులను అడిగితే తమకు తెలీదన్నారు. అది రొటీన్ ట్రాన్సఫర్ అన్నారు. చివరికి  అతని మిత్రుడు  అది యశోదాబెన్ వార్త ప్రభావం అని చెప్పాడు. యశోదా బెన్ వార్త ఇంత పని చేసిందా అని వనోల్ ఫ్రెండ్స్ దగ్గర వాపోయాడు.

ఆ నోటా ఈ నోటా పడి బదిలీ వార్త కూడా తిన్నగా మీడియా కెక్కింది. బదిలీ చేసేముందు న్యూ ఢిల్లీ సమాచార శాఖాధికారులు దూరదర్శన్ అధికారులతో మాట్లాడి వార్తకు సంబందించిన వివరణ అడిగారు. వనోల్ తో సహా నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఇందుకు బాధ్యులని అభియోగం మోపారు. చీవాట్లు పెట్టి వనోల్ ను మాత్రమే పోర్టుబ్లెయిర్ కు బదిలీ చేశారు.

ఇంతకూ వనోల్ ప్రసారం చేసిన వార్త ఏమిటంటే ?  ప్రధానమంత్రి భార్యగా తనకున్న హక్కులు ఏమిటి ? వాటి వివరాలు కావాలని గుజరాత్ పోలీసులను కోరుతూ యశోదా బెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు.

ఆ సమాచారాన్ని లోకల్ రిపోర్టర్ మామూలు గానే పంపారు. అదేమీ సాధారణ వార్త కాదు. పీఎం సతీమణి ఆర్టీఐ కి దరఖాస్తు పెట్టుకుంటే … వార్త ప్రసారం చేయకుండా ఉండరు. వనోల్ కూడా అదే చేశారు. అందులో తప్పేమి లేదు. వనోల్ బదిలీ గురించి కొన్ని పత్రికలు సమాచార మంత్రిత్వ శాఖను కోరాయి.

బదిలీ ఎడిటోరియల్, పాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయమని తమకేమి సంబంధం లేదని చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకున్నారు. 2015 జనవరిలో ఇది జరిగింది. అదలా ఉంటే … తన ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో యశోదా బెన్ రెండోసారి కూడా ఆర్టీఐ కి దరఖాస్తు చేసుకున్నారు.

పోలీసులు ఇది తమ పరిధిలో లేదని ఇంటెలిజెన్స్ కిందకు వస్తుందని మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఇంటెలిజెన్స్ ఆర్టీఐ పరిధిలో లేదు కాబట్టి యశోదాబెన్ తన సందేహాలకు సమాధానం పొందలేకపోయారు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!