A woman leader who raised funds through crowd funding………………
పై ఫొటోలో కనిపించే మహిళ పేరు జెనిబెన్ ఠాకూర్ .. గుజరాత్ లోని బనస్కాంత లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారానికి ఆర్థిక వనరుల కొరత ఉన్న క్రమంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారానిధులు సమీకరించి .. వాటిని సక్రమం గా ఉపయోగించుకుంటూ .. ప్రచార పర్వంలో దూసుకుపోయారు.
క్రౌడ్ ఫండ్ ద్వారా ఆర్థిక అవరోధాలను అధిగమించి ఠాకూర్ లోక్‌సభ ఎన్నికల్లో 30,406 ఓట్ల మెజారిటీతో బీజేపీకి చెందిన రేఖా చౌదరిని ఓడించారు, గుజరాత్ లోక్‌సభ ఎన్నికల్లో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. 2024 ఎన్నికల్లో మాత్రం బనస్కాంత లోకసభ స్థానంలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది ..
బీజేపీ కి మంచి పట్టున్న స్థానం బనస్కాంత నియోజకవర్గం. 2014,2019 ఎన్నికల్లో బీజేపీ నే అక్కడ గెలిచింది. ఈ ఎన్నికల్లో అక్కడ నుంచి ఇంజినీరింగ్ ప్రొఫెసర్ .. బనాస్ డెయిరీ వ్యవస్థాపకుడు గల్బాభాయ్ చౌదరి మనవరాలు రేఖా చౌదరి పోటీ చేశారు.
అక్కడ పార్టీ కున్న పట్టును కొనసాగించలేకపోయారు. 2014 .. 2019 లోక్‌సభ ఎన్నికలలో గుజరాత్లో ని మొత్తం 26 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బిజెపికి బలమైన కోటగా ఉన్న బనస్కాంత లో ఠాకూర్ విజయం కీలకమైనది.
జెనిబెన్ ఠాకూర్ ఓ కార్యకర్తగా కాంగ్రెస్‌లో చేరారు.. అందరితో కలుపుగోలుగా ఉంటారు. పార్టీకి విధేయురాలు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో వావ్ నియోజకవర్గం నుండి ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ గెలవలేక పోయింది. ఆమె 2017లో మళ్లీ పోటీ చేసి బీజేపీ నేత శంకర్ చౌదరిపై విజయం సాధించారు.
2022లో చౌదరి పొరుగున ఉన్న థారాడ్ నియోజకవర్గానికి మారారు.నాటి ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా వెనుకబడినప్పటికీ .. జెనిబెన్ మళ్లీ గెలిచారు, 182 సీట్లలో 17 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. గత పదేళ్ల కాలంలో ఠాకూర్ ప్రజలకు బాగా చేరువయ్యారు. ప్రజలు ఎలాంటి కార్యక్రమాలకు పిలిచినా వెళ్లేవారు.
ఈ సారి ఎన్నికల్లో జెనీబెన్ తన ప్రచారాన్నివ్యూహాత్మకంగా నిర్వహించింది. రోజుకు 18 గంటలు పని చేసింది. బైక్ ర్యాలీలలో పాల్గొన్నది. సాయంత్రం వేళల్లో మహిళా సంఘాలు .. కూలీలు .. మేస్త్రీలు .. కార్మిక సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించింది.
సంక్షేమ కార్యక్రమాలు .. ఆ ప్రాంతానికి అవసరమైన జీవనోపాధి అవకాశాల గురించి చర్చించారు. గ్రామాల్లో చిన్న చిన్న సమావేశాల్లోనూ ఆమె ప్రసంగించారు. పోలింగ్ రోజున ఆమె తన బృందంతో పాటు నియోజకవర్గం అంతటా బూత్‌లను పర్యవేక్షించారు.. చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు.