Fake educational institutes........................
దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) తేల్చి చెప్పింది. అలాంటి యూనివర్సిటీలు ఢిల్లీ అత్యధికంగా ఎనిమిది ఉండగా..యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు ప్రకటించింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని ugc స్పష్టం చేసింది.
యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని యూజీసీ చెబుతోంది. అలాంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించరు. . ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని UGC అంటోంది. ఈ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ స్పష్టం చేశారు.
ఏపీలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ; బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా వర్సిటీలు నకిలీవిగా ప్రకటించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్; కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్- దర్యాగంజ్; యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ; ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్; విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్; ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం) ఉన్నాయి.
యూపీలో నాలుగు యూనివర్సిటీల జాబితాలో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ); భారతీయ శిక్షా పరిషత్ ఉన్నాయి.
పశ్చిమబెంగాల్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చి సంస్థ… కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ; కేరళలో సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వర్సిటీలు జాబితాలో ఉన్నాయి.ఫేక్ యూనివర్సిటీల జాబితాను https://www.ugc.gov.in/వెబ్‌సైట్‌లో ఉంచింది.