పెళ్ళికి ముందు అక్కడ శృంగారం నిషేధం !

Sharing is Caring...

We may get a similar law……………………………………..

ఇకపై పెళ్లి కి ముందు శృంగారం కూడదంటూ ఇండోనేషియాలో కొత్త చట్టం అమలు లో కొచ్చింది. ఈ చట్టానికి ఇండోనేషియా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ముందు శృంగారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఉల్లంఘించేవారికి ఏడాది జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ముందు ఎవరైనా సరే శృంగారంలో పాల్గొంటే వారిని నేరం చేసిన వారిగా పరిగణిస్తారు.పెళ్ళికి ముందు శృంగారాన్ని నిషేధించే బిల్లుపై ఇండోనేషియా పార్లమెంట్ సంతకం చేసింది. ఈ చట్టానికి ఆమోదంతో ఇప్పుడు ఇండోనేషియాలో వివాహానికి ముందు ఎవరితోనైనా శారీరక సంబంధం కలిగి ఉండటం చట్టవిరుద్ధం, నేరంగా పరిగణిస్తారు.

ఈ కొత్త చట్టం ప్రకారం భార్యాభర్తలు మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉండాలి. మరోవైపు, వివాహిత జంట తమ భాగస్వామితో కాకుండా మరొకరితో శారీరక సంబంధాలు పెట్టుకున్నపక్షంలో దాన్ని కూడా నేరం గానే పరిగణిస్తారు. వివాహిత జంటల విషయంలో మహిళ లేదా పురుషుడు తమ భాగస్వామిపై కేసు నమోదు చేసినప్పుడు చర్యలుంటాయి.

ఈ చట్టం ప్రకారం కోర్టులో విచారణకు ముందు ఫిర్యాదును ఉపసంహరించుకోవచ్చు. అయితే విచారణ ప్రారంభమైన తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు.

ఇక ఈ చట్టం తీసుకురావడంపై ఆ దేశంలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. హిందుత్వ వాదులు కూడా ఈ చట్టం తీరు తెన్నులను పరిశీలించే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో భారత ప్రభుత్వం పై ఇలాంటి చట్టాల కోసం ఒత్తిడి తెచ్చే సూచనలున్నాయి . 

వివాహానికి ముందు శారీరక సాన్నిహిత్యం కలిగి ఉండటం వల్ల  లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. లాభాలకంటే నష్టాలే ఎక్కువ అని చెప్పుకోవాలి. పెళ్ళికి ముందే శృంగారం వల్ల ,, తర్వాత కాలంలో భాగస్వాములు ఒకరి పట్ల మరొకరు  ఆసక్తి కోల్పోవచ్చు. శారీరక సంబంధాల తర్వాత అబ్బాయి  కానీ  అమ్మాయి కానీ మొహం చాటేయవచ్చు. ఈ అంశం జీవితంపై  ప్రభావం చూపుతుంది. ఒక వేళ పెళ్లి చేసుకున్నప్పటికీ  ఇరువురిమధ్య ఆకర్షణ అంతగా ఉండదు. ఫలితంగా  భాగస్వాములు ఒకరికొకరు దూరం కావచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!