పిశాచి ప్రేమ కథలతో కోట్లు ఆర్జించిన రచయిత్రి !

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు స్టెఫీన్‌ మేయర్‌. అమెరికాలో పుట్టి పెరిగింది. మంచి పాఠకురాలు. షేక్స్పియర్, ఇతరుల రచనలు బాగా చదివింది. ఆ ప్రేరణతో తనే సొంతంగా కథలు రాయడం మొదలు పెట్టింది. ఆరంభంలో మేయర్ పుస్తకాలు ఎవరికి నచ్చలేదు.

లిటిల్ బ్రౌన్ కంపెనీ ఆమెను ప్రోత్సాహించింది. అప్పటినుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. మేయర్ కు దెయ్యాలు, పిశాచాలంటే అసలు భయం లేదు …  పిశాచాలు మనుష్యుల మధ్య ప్రేమలు, వ్యామోహాలు తదితర అంశాలతో ‘ట్విలైట్‌’ పేరిట నాలుగు పుస్తకాలు రాసింది మేయర్.

రక్తం తాగే డ్రాక్యులా పాత్ర ఆమెకు ఇష్టమైన పాత్ర. నవలలకు ఆదరణ పెరిగాక మేయర్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఏర్పడ్డారు. మేయర్  నవలలు 12 కోట్ల కాపీల మేరకు అమ్ముడు బోయాయి.37 భాషల్లోకి అనువాదమై సంచలనం సృష్టించాయి. ఇక ఆ నవలల ఆధారంగా తీసిన అయిదు సినిమాలు కూడా విపరీతంగా జనాలను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 3.3 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి. ‘ట్విలైట్‌’ (2008), ‘న్యూమూన్‌’ (2009), ‘ఎక్లిప్స్‌’ (2010), ‘బ్రేకింగ్‌ డౌన్‌’ (2011), ‘బ్రేకింగ్‌ డౌన్‌2’ (2012) పేర్లతో వచ్చిన ఈ సినిమాలన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్‌ దృశ్యాలతో సినీ అభిమానులను అలరించాయి.

వీటిలో ‘ఎక్లిప్స్‌’ సినిమా 2010 జూన్‌ 24న విడుదలైంది. ఐమాక్స్‌ ఫార్మట్‌లో విడుదలైన తొలి ట్విలైట్‌ సినిమాగా గుర్తింపు పొందిన దీన్ని 68 మిలియన్‌ డాలర్లతో తీస్తే 698 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

2010 లో ది షార్ట్ సెకండ్ లైఫ్ ఆఫ్ బ్రీ టాన్నర్ అనే మరో నవల రాశారు. 2015లో లైఫ్ అండ్ డెత్ .. ట్విలైట్ రీమాగిన్డ్ పేరిట ఒక నవలను విడుదల చేశారు. తర్వాత కాలంలో మిడ్నైట్ సన్ అనే మరో పుస్తకం వెలువడింది. ఈ బుక్ కూడా  అధిక సంఖ్యలో అమ్ముడు పోయింది.

తన ఆదాయంలో కొంత భాగాన్ని ఆమె సామాజిక సేవకు కూడా ఉపయోగిస్తారు.  కాగా మేయర్ రచనల పట్ల కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. ఆమె తనను తాను స్త్రీ వాదిగా ప్రకటించుకున్నారు.
“2008 లో టైమ్ మ్యాగ జైన్  మేయర్ ను 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల” జాబితాలో చేర్చింది.  మేయర్  వార్షిక ఆదాయం  50 మిలియన్లు పైమాటే.
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!