వెయిట్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన తెలుగు నటి !!

Sharing is Caring...

Mohammed Rafee ……………….

అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అరుదైన తొలి తెలుగు నటిగా ప్రగతి మహావాది నిలిచారు. పట్టుదల ఉంటే అసాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు టాలీవుడ్ నటి ప్రగతి మహావాది. క్యారెక్టర్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన ప్రగతి సరదాగా జిమ్ ప్రారంభించి వెయిట్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేసి కేవలం రెండేళ్ల సాధనలోనే రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లారు.

ఇప్పుడు ఏకంగా ఆసియా గేమ్స్ లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఒక స్వర్ణం, రెండు కాంశ్య పతకాలను గెలుచుకుని భారతీయ జెండా రెపరెపలాడించారు.మొదటి నుంచి ప్రగతి భిన్నమైన మనస్తత్వంతో ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. సినిమాలో తనకిచ్చిన పాత్రలో సహజంగా నటించి మంచి నటి అని పేరు తెచ్చుకున్నారు.

తను ఉండే గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో సైతం బుల్లెట్ పై తిరుగుతూ బుల్లెట్ యాక్ట్రెస్ అని గుర్తింపు పొందారు. 49 ఏళ్ల వయసులో టర్కీ లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్నారు. 105 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.

ఈ ఏడాది ప్రగతికి బాగా కలసి వచ్చిందనే చెప్పుకోవాలి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ గా నిలిచి, ఆ వెంటనే తెలంగాణ ఛాంపియన్ అయ్యారు. కేరళలో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణం పట్టి, భారత్ కు ప్రాతినిధ్యం వహించి టర్కీ లోనూ తన సత్తా చాటుకున్నారు. వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని ఇండియా యువతకు గొప్ప స్ఫూర్తినిచ్చారు.

అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించిన తొలి తెలుగు నటిగా అరుదైన నటిగా ప్రగతి మహావాది సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇది ప్రగతి విజయగాథ! చరిత్రలో నిలిచిపోయిన సక్సెస్! ఆమె జీవితంలో ఇదొక గొప్ప మలుపు! వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, టాలీవుడ్ నటి ప్రగతికి అభినందనలు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!